విద్యార్థులను అభినందిస్తున్న కలెక్టర్ శ్రీహర్ష
నారాయణపేట రూరల్: పెన్ను, పేపర్ లేకుండా మెదడులో కసరత్తు చేసి గణితంలో సమాధానాలు చెప్పే విధానం అబాకస్. దీంట్లో అతి వేగంగా అత్యధిక ప్రశ్నలను సాధించి పట్టణానికి చెందిన విద్యార్థులు ప్రపంచ రికార్డు పొందారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సింగార్‌బేస్ వీధిలో రీతూ అనే శిక్షకురాలు ప్రైవేట్‌గా కొద్దికాలంగా అబాకస్‌లో పిల్లలకు శిక్షణ ఇస్తుంది. ఈ క్రమంలో గతేడాది పట్టణానికి చెందిన చరణ్, వైభవ్, ప్రణవి ఐరేంజ్ సంస్థకు దరఖాస్తు చేసుకోగా వారి నుంచి పరీక్షలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఆయా విద్యార్థులకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేయగా వారు చూసి ఆన్‌లైన్‌లో లైవ్‌లో పరిశీలించారు.
అవాకై ్కన వారు హైదరాబాద్ కార్యాలయానికి పిలిపించి పది డిజిట్ లకు సంబంధించిన వంద ప్రశ్నలను వేయగా పెన్ను, పేపర్ లేకుండా ఒక్క నిమిషంలోనే సమాధానాలు చెప్పారు. దీంతో వారిని అబాకస్‌లో ఆర్థమెటిక్ క్యాలిక్యులేషన్ ప్రక్రియలో ప్రపంచ రికార్డు సాధించినట్లు ప్రకటించి ప్రశంసాపత్రాలను అందించారు. దీంతో సోమవారం కలెక్టర్ శ్రీహర్ష ముగ్గురు విద్యార్థులు, టీచర్‌ను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment