వాట్సాప్ వండర్ బాక్స్ మరో వండర్‌ను పరిచయం చేసింది. గణితం చదువుకునే సమయంలో ఎక్కాలు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలుసు. అంతేకాదు వాటిని బట్టీ పట్టడం ఎంత కష్టమో అనుభవమే.. మాస్టారు ఎక్కం అప్ప చెప్పమనగానే.. అయితే 5వ ఎక్కం, లేదంటే 10వ ఎక్కం...ఇదే కదా.. పిల్లలకు గుర్తొచ్చేది.. మిగతా ఎక్కాల జోలికి వెళ్లాలంటే విద్యార్థులకు ఒకింత గుబులే.. అయితే ఈ కష్టాల నుంచి గటెక్కేందుకు మాథ్స్ టీచర్ల చిట్కాలు, కిటుకులు పిల్లల మనసుల్లో బాగా గుర్తుండి పోతాయి కూడా.
తాజాగా అలాంటి టీచర్ ఒకరు వాట్సాప్ వండర్ బాక్స్‌లో రౌండ్లు కొడుతున్నారు. తొమ్మిదో ఎక్కాన్ని అతి సులువుగా విద్యార్థులకు నేర్పిస్తున్న ఈ వీడియో పలువురిని ఆకట్టుకుంటోంది. కార్పొరేట్ దిగ్గజం ఎం అండ్ ఎం ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ఇలాంటి వీడియో నొకదాన్ని ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ తెలివైన, సులువైన షార్ట్‌కట్ గురించి తెలియదు. ఆమె నా గణిత ఉపాధ్యాయురాలిగా ఉండివుంటే.. గణితంలో బహుశా ఇంకా చాలా మెరుగ్గా వుండేవాడినంటూ వ్యాఖ్యానించారు. దీనికి ముగ్ధుడైన బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ రీ ట్వీట్ చేశారు. అంతేకాదు దీన్ని బైజూస్‌కి పంపిస్తున్నానని షారూక్ ట్వీట్ చేయడం విశేషం.
Whaaaat? I didn’t know about this clever shortcut. Wish she had been MY math teacher. I probably would have been a lot better at the subject! #whatsappwonderbox pic.twitter.com/MtS2QjhNy3
— anand mahindra (@anandmahindra) January 22, 2020
Comments
Please login to add a commentAdd a comment