టీవీలో గల్లీ క్రికెట్‌.. బంతి తగలగానే తెలిసింది అసలు మేటర్‌.. | Anand Mahindra Post Children Playing Cricket Is Commentary Pandemic Viral | Sakshi
Sakshi News home page

Anand Mahindra: గల్లీ క్రికెట్‌.. పిల్లల ఐడియాకి ఆనంద్‌ మహీంద్రా ఫిదా

Published Mon, Sep 13 2021 7:29 PM | Last Updated on Tue, Sep 14 2021 4:25 PM

Anand Mahindra Post Children Playing Cricket Is Commentary Pandemic Viral - Sakshi

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో సమాజంలోని పలు అంశాలను పంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అందులో ఆలోచింపజేసేవి, కొత్త టాలెంట్‌ను ప్రోత్సాహించడం.. ఇలా ఆ జాబితాలో బోలెడు ఉంటాయి. తాజాగా ఈ వ్యాపార దిగ్గజం గ‌ల్లీలో పిల్లలు ఆడుతున్న క్రికెట్‌కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఏముంది అనుకుంటున్నారా.. అక్క‌డే ఉంది అస‌లు ట్విస్ట్.

కొంతమంది పిల్లలు టీవీ స్క్రీన్‌ను చూస్తుంటారు.. అలా వీడియోతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ టీవీలో కొందరు పిల్లలు క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటారు. అది అచ్చం టీవీలో లైవ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ చూసినట్లే ఉంటుంది. అయితే, కొన్ని సెకన్ల తర్వాత బ్యాట్స్‌మెన్‌ కొట్టిన బంతి నేరుగా టీవీ వెలుపల చూస్తున్న పిల్లలపై పడుతుంది. దీంతో.. ఫీల్డ‌ర్ వ‌చ్చి ఫ్రేమ్‌లో నుంచి తొంగి చూసి బంతి ఇవ్వాలని అక్క‌డ కూర్చొని టీవీ చూస్తున్న ఓ పిల్లాడిని అడుగుతాడు. 

దీంతో అప్పుడు తెలుస్తుంది అసలు మేటర్‌.. అది రీల్‌ మ్యాచ్ కాద‌ని.. ఫ్రేమ్ నుంచి వెనుక జ‌రుగుతున్న గ‌ల్లీ క్రికెట్‌ను చూసేందుకు పిల్లలు ఆ టీవీని అలా అమర్చి చూస్తున్నారని.  వాళ్ల ఐడియా చూసి ఆనంద్ మ‌హీంద్రా ఫిదా అయ్యి ఈ వీడియోను త‌న ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దానికి క్యాప్షన్‌గా.. ఇది పాత వీడియోనే అయినా నాకేందుకో మ‌రోసారి పోస్ట్ చేయాల‌నిపించింది. క‌రోనా మ‌హ‌మ్మారి మన‌ల్ని స్క్రీన్లకే ఎలా ప‌రిమితం చేసిందో తెలిసిన విషయమే. ఏ ప‌ని చేయాల‌న్నా ఆన్‌లైన్‌లోనే.. లైవ్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను చాలా మిస్ అయ్యాం.

అందుకే.. నాకు కూడా అలా స్క్రీన్‌లో నుంచి కాకుండా రియాల్టీని ఎంజాయ్ చేయాల‌ని ఉంది.. అంటూ ట్వీట్ చేశారు. ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌ నెటిజ‌న్లను  ఫుల్‌గా ఆకట్టుకుంటోంది. అంతేగాక గాక ఆ పిల్ల‌ల క్రియేటివిటిని కూడా వీడియో చూసిన వారందరూ మెచ్చుకుంటున్నారు. ఆ వీడియోను మ‌ళ్లీ ఈ ‍రకంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

చదవండి: Viral Video: ఇంటర్వ్యూలో ఉండగా చెల్లిని చితకబాదిన అక్క..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement