అమెరికన్‌ పోలీసులా మజాకా! | Girl sends tricky maths homework to police and gets surprising response | Sakshi
Sakshi News home page

అమెరికన్‌ పోలీసులా మజాకా!

Published Fri, Feb 24 2017 11:53 PM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

అమెరికన్‌ పోలీసులా మజాకా!

అమెరికన్‌ పోలీసులా మజాకా!

లీనా డ్రేపర్‌ హోమ్‌ వర్క్‌ చేసుకుంటోంది. ఆ చిన్నారి వయసు 10 ఏళ్లు. మ్యాథ్స్‌లో ఆమెకో డౌట్‌ వచ్చింది. మేథ్స్‌ ఎలా ఉంటుందో తెలుసు కదా! మనసు లేని సబ్జెక్ట్‌. పాషాణ హృదయురాలు. చిన్న పిల్లా, పెద్ద పిల్లా అని చూసుకోదు. ఆన్సర్‌ కావాలంతే! ఏదో ఒకలా చెప్పేస్తే ఊరుకోదు. లాజిక్‌  కావాలి.

లీనాకు వచ్చిన కష్టం ఏంటంటే (8+29) ×15 = ఎంత అన్నది. అమ్మని అడిగితే ‘సొంతంగా చెయ్‌’ అంది. నాన్నని అడిగితే ‘ఐ యామ్‌ బిజీ’ అన్నాడు. ఏం చేయాలో పాలుపోలేదు లీనాకు. వెంటనే నెట్‌లోకి వెళ్లి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఫేస్‌బుక్‌ పేజ్‌ ఓపెన్‌ చేసింది. తన సమస్యను అందులో పోస్ట్‌ చేసింది. తర్వాత ఏం జరిగి ఉంటుంది?

పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి సమాధానం వచ్చేసింది! ‘ఫస్ట్‌.. బ్రాకెట్‌లో ఉన్న వాటిని కలుపు. కలపగా వచ్చిన మొత్తాన్ని 15తో గుణించు’ అని మెసేజ్‌ ఇచ్చారు ఓహియో స్టేట్‌ పోలీసులు. లీనా డ్రేపర్‌ ఆనందానికి హద్దుల్లేవు.

‘అది మా జ్యురిస్‌డిక్షన్‌లోకి రాదు’ అని తరచు మన పోలీసులు అంటుంటారు. అలాగైతే లీనా డ్రేపర్‌ అడిగిన హెల్ప్‌ అమెరికాలోని 50 రాష్ట్రాల పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ల పరిధిలోకి రాదు. అయినా లీనాకు సమాధానం వచ్చింది. సహాయం చేసే ఉత్సాహం ఉంటే పరిథులు, పరిమితులు అడ్డొస్తాయా!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement