వెబ్‌సైట్‌లో పంచాయతీ కార్యదర్శి హాల్‌టికెట్లు | Panchayat secretary Hall tickets can be downloaded from APPSC website today onwards | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో పంచాయతీ కార్యదర్శి హాల్‌టికెట్లు

Published Tue, Feb 18 2014 6:33 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM

Panchayat secretary Hall tickets can be downloaded from APPSC website today onwards

 నేటి నుంచి డౌన్‌లోడ్‌కు అవకాశం
 సాక్షి, హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ పోస్టుల రాతపరీక్ష ఈనెల 23న జరగనుంది. 2,677 పోస్టుల కోసం 8 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం నుంచి 23వ తేదీ ఉదయం 8 గంటల వరకు అభ్యర్థులు హాల్ టికెట్లను ఠీఠీఠీ.్చఞటఞటఛి.జౌఠి.జీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ వెల్లడించింది. రాష్ట్ర విభజన బిల్లు, సీమాంధ్రలో ఆందోళనల మధ్య పరీక్ష జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ అనుమానాలను తొలగిస్తూ ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహణకు సిద్ధమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement