panchayat secretaries posts
-
అప్పుడే అర్థమైంది.. అసలు పరీక్ష ప్రారంభమైందని!
సాక్షి, ఘట్కేసర్ : వారంతా అర్ధాకలితో నిరుద్యోగ బాధను దిగమింగుకున్నారు. రాత్రింబవళ్లూ శ్రమించి చదువుకున్నారు. పేదరికం విలువ తెలుసుకొని పోటీ పరీక్షలకు సమయత్తమై విజేతలుగా నిలిచి పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగం సాధించారు. కటిక పేదరికాన్ని అనుభవించి ఉద్యోగం రావడంతో ఉప్పొంగిపోయారు. ఇన్నాళ్లు కష్టపడి చదివించిన తల్లితండ్రుల జీవితాల్లో వెలుగులు నింపుదామని అనుకున్నారు. ఏడాది పాటు ఉత్సాహంగా విధులు నిర్వహించారు. ఆ తర్వాతే తెలుసుకున్నారు జీవితంలో అసలు పరీక్ష ప్రారంభమైందని. పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగమిచ్చినా.. సర్కారు శిక్షణ ఇవ్వకుండానే ఉద్యోగ బాధ్యతలు అప్పగించడంతో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. పని భారం పెరగడం, ప్రజా ప్రతినిధులు, అధికారుల ఒత్తిడిని భరించలేకపోయారు. అప్పటి వరకు పేదరికాన్ని చవిచూసిన ఆ ఉద్యోగులు కుటుంబానికి అన్నం పెట్టే ఉద్యోగానికే రాజీనామ చేశారు. 2019 సంవత్సరంలో జిల్లాలో 20 మంది జూనియర్ కార్యదర్శలుగా ఉద్యోగంలో చేరగా 9 మంది రాజీనామా చేశారు. చదవండి: కూకట్‌పల్లిలో బయటపడ్డ ఫేక్ డాక్టర్ మోసం! కనుబొమ్మలు తీసివేసి.. కోట్లలో మోసాలు ఒత్తిడి భరించలేక... నియామక సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో శిక్షణ లేకుండానే ఉద్యోగంలో చేరారు. అనంతరం పల్లెప్రగతి కార్యక్రమం వారికి దిమ్మదిరిగేలా చేసింది. ఇంటి అనుమతులు, పన్నుల వసూళ్లతో పాటు ఉపాధి హామీ పనులు, హరితహారం, పల్లె ప్రగతి, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు షెడ్ల పనులు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కార్పొరేట్ స్కూల్లో చదవడంతో గ్రామ కంఠం భూమి అంటేనే వారికి తెలియదు. అలాంటిది సర్పంచ్, ఉప సర్పంచులకు మధ్యన పొసగక పోవడం, ఓడిన, గెలిచిన వారు రెండు వర్గాలుగా చీలి అభివృద్ధి పనులు ఆపడం, కొత్తగా వచ్చిన జూనియర్ కార్యదర్శులకు మేజర్ పంచాయతీలు అప్పగించడం, డీపీఓ ఆఫీస్ నుంచి ఉదయం 8 గంటలకే వీడియో కాల్ రావడం తల నొప్పిగా మారింది. ఉదయం ఇంటి నుంచి బయలు దేరిన వాళ్లు తిరిగి ఇంటికి ఎప్పుడు చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్రజాప్రతినిధుల ఒత్తిడి పెరగడం, నిధులు లేకున్నా పనులు చేయాలని మెడమీద కత్తిపెట్టడం, లేదంటే షోకాజ్ నోటీసులివ్వడం వారిని మరింత కుంగదీసింది. ఎగ్జిక్యూటివ్ పదవి కార్యదర్శి ఉద్యోగం వదిలి చిన్న స్థాయి ఉద్యోగంలో చేరిపోయారు. ప్రభుత్వం ఇలాంటి అంశాలపై దృష్టిసారించి ప్రస్తుతం అమలు చేస్తున్న అవుట్ సోర్సింగ్ విధానాన్ని రదు చేసి నోటిఫికేషన్ ద్వారా జూనియర్ కార్యదర్శుల నియామకాలను నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. సవాలక్ష ఆంక్షలతో ఎలా... ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు విధిస్తూ నిరుద్యోగులను మోసం చేస్తోంది. జూనియర్ కార్యదర్శులుగా అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి నోటిఫికేషన్ ద్వారా నియామకాలను చేపట్టాలి. – బద్దం మిత్రారెడ్డి, నిరుద్యోగి, ఘనాపూర్ -
ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 425 గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్డ్, పదోన్నతి, చనిపోయిన కార్యదర్శుల స్థానే కొత్త పోస్టులు మంజూరయ్యే వరకు.. తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంగళవారం వెల్లడిం చింది. ఈ మేరకు జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నియామకాలు చేపట్టాలని పీఆర్ శాఖ కమిషనర్ కలెక్టర్లను ఇటీవలే ఆదేశించారు. ఈ పోస్టులకు రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సైనికులనే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన నియమించే వీరికి నెలకు రూ.15 వేల వేతనం ఇవ్వనున్నారు. ఈ నెలాఖరులోపు భర్తీ చేయనున్న ఈ పోస్టులకు కనీస విద్యార్హతగా డిగ్రీ ఉత్తీర్ణతను నిర్ణయించారు. -
పంచాయతీ కార్యదర్శులు ‘అవుట్’
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలు భర్తీ అవుట్ సోర్సింగ్ పద్ధతితో భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇటీవల పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారాలోకేష్ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. గ్రామానికి ఒక కార్యదర్శి నియమించే ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోచుకోక.. ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్ పడుతుందా? ఎలాగోలా కష్టపడి ఉద్యోగం సాధిద్దామా? అనే నిరుద్యోగుల ఆశలకు ప్రభు త్వ నిర్ణయం ప్రతిబంధకంగా పరిణమించనుంది. జిల్లాలో 970 పంచాయతీలున్నాయి. వీటిని పాలనా సౌలభ్యం నిమిత్తం వీటిని 487 క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్‌కు ఒకరు చొప్పున కార్యదర్శిని నియమించాల్సి ఉండగా.. గతంలో ప్రభుత్వం 360 ఉద్యోగాలు భర్తీ చేసింది. కార్యదర్శుల కొరత నేపథ్యంలో ఒక్కో కార్యదర్శి తనకు కేటాయించిన క్లస్టర్‌కు రెగ్యులర్‌గానూ.. మరో క్లస్టర్‌కు ఇన్చార్జ్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 342 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. క్లస్టర్‌కు ఒకరు చొప్పున నియామకం చేపట్టినా జిల్లాకు ఇంకా 145 మంది అవసరం. కానీ ఇంత వరకూ ఎంపిక చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో గ్రామకార్యదర్శుల కొరత వేధిస్తుండటంతో పాలనలో ఇబ్బందులు నెలకొన్నాయి. మరోవైపు నాలుగైదు మైనర్ పంచాయతీలను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు చేసి వాటికి కార్యదర్శిని నియమించారు. తద్వారా పనిభారం పెరగడంతోపాటు కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పంచాయతీకి ఓ కార్యదర్శి ప్రస్తుతం పాలనా సౌలభ్యం నిమిత్తం ప్రతి గ్రామ పంచాయతీకి ఓ కార్యదర్శిని నియమించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఒకవేళ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే జిల్లావ్యాప్తంగా 628 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఎన్నిక ప్రక్రియ అవుట్ సోర్సింగ్ ద్వారా చేపట్టనున్నారు. త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. నెలాఖరుకు స్పష్టత ఉద్యోగాల భర్తీ విషయంలో నెలాఖరుకు స్పష్టత రానుంది. పంచాయతీ కార్యదర్శికి కనీస విద్యార్హతగా డిగ్రీని నిర్ణయించారు. రాత పరీక్షలో మెరిట్సాధించిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పోస్టుల భర్తీకి జిల్లా స్థాయిలో ఐదుగురితో ఒక సెలక్షన్ కమిటీ ఏర్పాటు కానుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓ, రెవెన్యూ, మరో శాఖ అధికారిని సభ్యులుగా నియమించనున్నారు. అభ్యర్థుల ఎంపికలో కమిటీతే తుది నిర్ణయం. నిరుద్యోగుల్లో ఆందోళన ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ అటుంచితే నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ప్రతి ఉద్యోగం ఒప్పంద ప్రాతిపదిక నిర్వహించడంతో తాము ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం చేస్తున్న నిరీక్షణకు తెర పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఉద్యోగం అవుట్ సోర్సింగ్‌లో చేపడితే ఇక.. ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడోస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈవోపీఆర్డీ, కంప్యూటర్ ఆపరేటర్ల నియామకం! జిల్లాలోని 49 మండలాల పరిధిలో 42 మంది ఈఓపీఆర్డీలు విధులు నిర్వర్తిస్తుండగా ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీని పదోన్నతుల ద్వారా చేపట్టనున్నారు. ప్రస్తుతం 125 మంది కంప్యూటర్ ఆపరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి నియమించే తరుణంలో పెద్ద పంచాయతీకి కంప్యూటర్ ఆపరేటర్ నియామకం తప్పనిసరి. వీటిని సైతం భర్తీ చేసే అవకాశం ఉంది. -
‘ముంపు’ గండం
ఖమ్మం కలెక్టరేట్ : పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి పోలవరం ‘ముంపు’ గండం పొంచి ఉంది. సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయి... రోజులు గడుస్తున్నా జిల్లాలోని 83 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయడం లేదు. ఇందులో పోలవరం ముంపుతో ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిన ఏడు మండలాల పరిధిలోనే ఎక్కువ పోస్టులు ఉండడంతో ఏం చేయాల నేది అధికారులకు అంతు పట్టడం లేదు. ఈ విషయంలో ఏ స్థాయిలోనూ ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వారు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే, ఈ పోస్టుల భర్తీకి ముంపు మండలాలను సాకుగా చూపుతున్నారే తప్ప.. ఈ మండలాల్లోని పోస్టులను భర్తీ చేయకుండా నిలిపివేయాలని ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వలేద ని, అలాంటప్పుడు పోస్టుల రిక్రూట్మెంట్ చే యకుండా ఎందుకు ఆపుతున్నారో అర్థం కా వ డం లేదని అర్హులైన అభ్యర్థులు వాపోతున్నారు. 65 పోస్టులు ముంపు మండలాల్లోనే... జిల్లా వ్యాప్తంగా గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు 149 ఉన్నాయి. వాటిలో 35 మంది రెగ్యులర్ కార్యదర్శులు పనిచేస్తున్నారు. ఇవి పోగా 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 83 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో రాత పరీక్షలు నిర్వహించి, అందులో ఎంపికైన వారి సర్టిఫికెట్లను కూడా పరిశీలించారు. అయితే వారికి పోస్టింగ్‌లు ఇ వ్వడంలో మాత్రం అధికారులు తాత్సారం చే స్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రోజుల తరబడి పోస్టుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు. అధికారులు ఏమంటున్నారంటే... ప్రస్తుతం భర్తీ చేయల్సిన 83 పోస్టులకు గాను 65 పోస్టులు ఆంధ్రప్రదేశ్‌లో కలిసే ముంపు ప్రాంతాలైన ఏడు మండలాల్లోనే ఉన్నాయని, వీటి భర్తీ ఎలా చేపట్టాలలో అర్థం కావడం లేదని అధికారులు చెపుతున్నారు. మరోవైపున ఈ పోస్టుల భర్తీ నిలిచిపోవడంతో అర్హులైన అభ్యర్థుల్లో ఆందోళన మొదలవుతోంది. ముంపు సమస్యతో పెట్టుకుంటే ఇది ఇప్పుడిప్పుడే పరిష్కా రం కాదని, తమకు ఇప్పట్లో ఉద్యోగాలొచ్చే అవకాశం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఇక ముంపు మండలాకు చెందిన అభ్యర్థులయితే మరీ గందరగోళ పడుతున్నారు. ఎప్పుడో పరీక్షలు రాసిన తమకు ఇప్పుడు ఆర్డినెన్స్ పేరుతో ఉద్యోగాలివ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలోనే ఉంటామని, తాము ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేది లేదని చెపుతున్నా వినకుండా ఆర్డినెన్స్ ఇవ్వడమే అప్రజాస్వామికమని, ఇప్పుడు వచ్చిన ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిలిపివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సాకులు చెప్పకుండా, పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు, ఉద్యోగ, ప్రజాసంఘాల వారు కోరుతున్నారు. -
వెబ్సైట్లో పంచాయతీ కార్యదర్శి హాల్‌టికెట్లు
నేటి నుంచి డౌన్‌లోడ్‌కు అవకాశం సాక్షి, హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది. ఈ పోస్టుల రాతపరీక్ష ఈనెల 23న జరగనుంది. 2,677 పోస్టుల కోసం 8 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం నుంచి 23వ తేదీ ఉదయం 8 గంటల వరకు అభ్యర్థులు హాల్ టికెట్లను ఠీఠీఠీ.్చఞటఞటఛి.జౌఠి.జీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ వెల్లడించింది. రాష్ట్ర విభజన బిల్లు, సీమాంధ్రలో ఆందోళనల మధ్య పరీక్ష జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ అనుమానాలను తొలగిస్తూ ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహణకు సిద్ధమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. -
పంచాయతీ కార్యదర్శి పోస్టులపై ఉత్కంఠ
ఒంగోలు, న్యూస్‌లైన్: పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ద్వారా 129 రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసేందుకు 2013లో జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇదే తరహా నోటిఫికేషన్ ఇతర జిల్లాల్లో కూడా సంబంధిత జిల్లా యంత్రాంగాలు విడుదల చేశాయి. ప్రస్తుతం ఇతర జిల్లాల్లో పంచాయతీ కాంట్రాక్టు కార్యదర్శులు కొంతమంది పోస్టులు మొత్తం తమకే కేటాయించాలంటూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో తాత్కాలికంగా స్టే కొనసాగుతోంది. ఈ దశలో మన జిల్లాలో ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయమై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. జిల్లాలో ఏళ్ల తరబడి కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులుగా 129 మంది పనిచేస్తున్నారు. వీరిలో 8 మంది ఉద్యోగాల నుంచి తరువాత తప్పుకున్నారు. అయితే గత ఏడాది నవంబర్‌లో జిల్లా యంత్రాంగం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని ప్రకారం 129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నోటిఫికేషన్లో కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఇది కాకుండా డిగ్రీ పూర్తయినప్పటి నుంచి ఏడాదికి ఒక శాతం చొప్పున పదేళ్లకు మించకుండా పది మార్కులు కేటాయించారు. దీంతో కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శి డిగ్రీలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై ఉంటే అతనికి ఉద్యోగం లభించినట్లే. రోస్టర్ ప్రకారం పరిశీలిస్తే మరో మూడు పోస్టులకు కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు అనర్హులుగా మిగులుతారు. అంటే 118 మంది కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు పర్మినెంట్ అవుతారనేది స్పష్టం. ఈ నేపథ్యంలో మిగిలిన 11 ఉద్యోగాల కోసం జిల్లా వ్యాప్తంగా దాదాపు 5400 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల ప్రక్రియ 2013 నవంబర్ 18వ తేదీతో ముగిసింది. ఈ సందర్భంగా అధికారులు వారంరోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తిచేస్తామని ప్రకటించినా జాప్యం జరిగింది. ఇప్పటి వరకు రోస్టర్ తదితర వివరాలను పోల్చి చూస్తూ ఇంటర్వ్యూకు అర్హులైన వారిని పిలిచేందుకు జాబితా కూడా సిద్ధం చేసుకున్నారు. చివరిగా ఒకసారి పరిశీలించి వాటిని కలెక్టర్ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదీ తాజా సమస్య: మన జిల్లాలో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించలేదు. ఆ మేరకు ఎటువంటి ఉత్తర్వులు లేవు. ఒక వేళ అభ్యర్థులను ఎంపికచేసి కౌన్సెలింగ్ పూర్తిచేసే నాటికి ట్రిబ్యునల్ ఉత్తర్వులు వెలువడతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకే విధానం అంటూ తీర్పు ఇస్తే కౌన్సెలింగ్‌కు పిలిచిన వారిని ఏం చేయాలనేది పెద్ద సమస్యగా మారుతుంది. అదే జరిగితే ఆశగా దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థులు కూడా తీవ్ర నిరుత్సాహానికి గురవుతారు. ఇప్పటికే పరీక్ష ఫీజు, దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు పేరుతో నిరుద్యోగులు చాలా ఖర్చుచేసిన నేపథ్యంలో మరలా వారిని ఇబ్బంది పెట్టినట్లు అవుతుందేమో అని అధికారులు అయోమయపడుతున్నారు. ఇదిలా ఉంటే రోస్టర్ ప్రకారం పరిశీలిస్తే జిల్లాలో కొంతమంది కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగాలు లభించే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రక్రియను జాప్యం చే స్తున్నారు. ప్రస్తుతం పూర్తి వివరాల కోసం ఎదురుచూస్తున్నాం: కే.శ్రీదేవి, డీపీవో పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచేందుకు జాబితా సిద్ధం చేశాం. అయితే ట్రిబ్యునల్ ఉత్తర్వులతో మన జిల్లాకు ఎటువంటి సంబంధం లేకపోదు. ముందు ముందు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ట్రిబ్యునల్ ఉత్తర్వులకు సంబంధించి ఇతర జిల్లాలకు వచ్చిన పూర్తి సమాచారాన్ని తెప్పించుకునే పనిలో ఉన్నాం. కలెక్టర్‌తో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటాం. -
ఇదేం ‘పంచాయతీ’
ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో 29 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయడానికి 2013 డిసెంబర్ మెదటి వారంలో అధికారులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర కేటగిరీల అభ్యర్థులు మొత్తం 5,500 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగ అభ్యర్థులతో పాటు పని చేస్తున్న కాంట్రాక్టు కార్యదర్శులు కూడా ఇం దులో దరఖాస్తు చేసుకోవాలని, సర్వీసును గుర్తించి డిగ్రీ మార్కులే కాకుండా 25 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, తమను రెగ్యులర్ చేస్తానని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇపుడు అన్యాయం చేస్తోందంటూ జిల్లాలో పనిచేస్తున్న సుమారు 24 మంది కాంట్రాక్టు కార్యదర్శులు డిసెంబర్ 10న ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని, వారు పని చేస్తున్న పోస్టులను భర్తీ చేయకూడదని ట్రిబ్యునల్ జనవరి మొదటి వారం లో తీర్చు నిచ్చింది. కాంట్రాక్టు కార్యదర్శులుగా పని చేస్తున్న వారిలో ఇంటర్ అర్హత ఉంటే వారికి డిగ్రీ పూర్తి చేసే వరకు సమయాన్ని ఇచ్చి, ఆ తరువాత వారిని రెగ్యులర్ చేస్తూ నియమక పత్రాలు ఇవ్వాల ని సూచించింది. ఈ తీర్పు కాంట్రాక్టు కార్యదర్శులకు అనుకూలంగానే ఉన్నప్పటికీ 29 పోస్టుల భర్తీకి అధికారులు జారీ చేసిన నోటిపికేషన్ విషయంలో ఏం చేయాలో ట్రిబ్యునల్ ఎలాంటి స్పష్టత ఇవ్వలే దు. దీంతో జిల్లా పంచాయతీ అధికారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది. అయితే ట్రిబ్యునల్ ఉత్తర్వులు తమకు ఇంకా చేరలేదని చెబుతున్నారు. దరఖాస్తులు చేసుకున్నవారి పరిస్థితేంది ట్రిబ్యునల్ కాంట్రాక్టు కార్యదర్శులకు అనుకూలం గా ఇవ్వడంతో.. 29 పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న నిరుద్యోగుల పరిస్థితి అయోమయంగా మా రింది. దూర ప్రాంతాల నుంచి ప్రయాణ ఖర్చులు పెట్టుకుని జిల్లా కేంద్రానికి వచ్చి ఎంతో ఆశతో దరఖాస్తులు చేసుకున్నారు. బీసీలు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.50 డీడీ కూడా కట్టారు. ఈ మొత్తం నిధులు రూ.2లక్షలకు పైగా డీపీఓ ఖాతాలో జమ అయ్యాయి. ఉచితంగా దరఖాస్తులు చేసుకున్న వారేమేగాని,డబ్బులు ఖర్చు చేసి దరఖాస్తు చేసుకున్న వారినుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నా యి. ఈ తికమకపై పంచాయతీ అధికారులు జిల్లా కలెక్టర్‌తో లేదా ప్రభుత్వంతో చర్చించనున్నారు. స్పష్టత వచ్చే వరకు భర్తీ చేయం - సురేశ్‌బాబు, జిల్లా పంచాయతీ అధికారి ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన తీర్పు కాంట్రాక్టు కార్యదర్శులకు అనుకూలంగా ఉంది. కాని 29 పోస్టుల భర్తీకి మేం ఇచ్చిన నోటిఫికేషన్, పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల విషయంలో ఏం చేయాలని కోర్టు సూచించిందో తెలియదు. ఉత్తర్వులను పరిశీలించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అప్పటి వరకు కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులర్ గాని, పోస్టుల భర్తీ గాని చేయబోం. -
పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాలో 122 పోస్టులను భర్తీ చేసేందుకు బుధవారం జిల్లా అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీ పూర్తిచేసిన స్థానిక అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కార్యదర్శులకు ఈ పోస్టుల భర్తీలో 25శాతం వెయిటేజీ ఇస్తున్నట్టు ప్రకటించారు. డిగ్రీలో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. గురువారం నుంచి జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయంలో రూ.50 చెల్లించి దరఖాస్తులు పొందవచ్చని, పూర్తిచేసిన దరఖాస్తులను ఈ నెల 16వ తేదీలోపు అందజేయాలని ఇన్చార్జి డీపీఓ వరప్రసాద్‌రెడ్డి వెల్లడించారు.