పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ | 122 panchayat secretaries posts to be filled | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

Published Thu, Nov 7 2013 12:57 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

122 panchayat secretaries posts to be filled

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాలో 122 పోస్టులను భర్తీ చేసేందుకు బుధవారం జిల్లా అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీ పూర్తిచేసిన స్థానిక అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కార్యదర్శులకు ఈ పోస్టుల భర్తీలో 25శాతం వెయిటేజీ ఇస్తున్నట్టు ప్రకటించారు. డిగ్రీలో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. గురువారం నుంచి జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయంలో రూ.50 చెల్లించి దరఖాస్తులు పొందవచ్చని, పూర్తిచేసిన దరఖాస్తులను ఈ నెల 16వ తేదీలోపు అందజేయాలని ఇన్‌చార్జి డీపీఓ వరప్రసాద్‌రెడ్డి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement