సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
సుభాష్‌నగర్: టీఎస్‌పీఎస్సీ ద్వారా జూలై 1న జరగనున్న గ్రూప్–4 పరీక్ష నిర్వహణకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గ్రూప్–4 పరీక్షలను పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శా ఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వ హించారు. పరీక్ష ఏర్పాట్లు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై అదనపు కలెక్టర్ వివరించారు. జూలై 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో 39,183 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని వివరించారు. వీరి కోసం 125 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామ న్నారు. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా ఇప్పటికే అత్యధిక మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని, మిగతా వారు కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
అభ్యర్థులు నిర్ణీత సమయానికి కనీసం 15 నిమిషాలు ముందే కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. సమయం దాటితే లోనికి అనుమతి ఉండదని స్పష్టంచేశారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బస్టాండ్లలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. లైజనింగ్ ఆఫీసర్, ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించామని చెప్పారు. అభ్యర్థులు నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ మధుసూదన్‌రావు, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, డీఐఈవో రఘురాజ్, డీఈవో దుర్గాప్రసాద్, డీటీసీ వెంకటరమణ, చీఫ్ సూపరింటెండెంట్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment