రేపు టెట్
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు జిల్లా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం నాడు టెట్ నిర్వహించనున్నారు. డీ.ఈడీ అభ్యర్థులు హాజరయ్యే పేపర్-1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 10 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి 2,325 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. బీ.ఈడీ అభ్యర్థులు హాజరయ్యే పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 80 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఇందుకు 19,196 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు
పరీక్షకు ఒక నిమిషం ఆలస్యమైన అనుమతించరు.
పరీక్ష సమయం పూర్తైన తర్వాతనే హాలు వదిలి వెళ్లాలి.
హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో పెట్టారు.
గతంలో వెబ్‌సైట్ నుంచి తీసిన హాల్‌టికెట్లు కూడా అనుమతిస్తారు
హాల్‌టికెట్ పొందిన వారు పరీక్ష కేంద్రం చిరునామాను ఒక రోజు ముందుగానే తెలుసుకుని పరీక్ష రోజు గంట ముందుగా సెంటర్‌కు హాజరుకావాలి.
ఓఎంఆర్ షీట్‌లో వైట్‌నర్‌తో దిద్దడం చేయకూడదు.
ఓఎంఆర్ షీట్‌లో హాల్‌టికెట్ నంబరు వేయడం, పేపర్ కోడ్‌ను నలుపు వలయంగా షేడ్ చేయడం తప్పనిసరి.