నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలి..
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఈ–హాల్‌టికెట్లు చెల్లుబాటు
సందేహాలుంటే సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 08462–245333
నిజామాబాద్ అర్బన్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, 18వ తేదీ వరకు కొనసాగుతాయని, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి ఒడ్డెన్న తెలిపారు. గురువారం నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్ష కేంద్రానికి ఆరగంట ముందుగానే చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడదని అధికారులు పేర్కొంటున్నారు.
సర్వం సిద్ధం
జిల్లాలో 43 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 18,101 మంది జనరల్ విద్యార్థులు, 1,607 మంది వోకేషన్ విద్యార్థులు మొత్తం 19,708 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో రెగ్యులర్ విద్యార్థులు 15,649, ప్రైవేట్ విద్యార్థులు 2,440 మంది.. మొత్తం 18,089 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 1,321, ప్రైవేట్ విద్యార్థులు 177 మంది మొత్తం 1,498 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం మొత్తం మంది విద్యార్థులు 39,295 మంది విద్యార్థులు ఉన్నారు.ప్రభుత్వ కళాశాలలు 17 సెంటర్లు, ఎయిడెడ్–2, రెసిడెన్షియల్–2, మోడల్ స్కూళ్లు–2, ప్రైవేట్‌లో–19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 1,007 ఇన్విజిలేటర్లను కేటాయించారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు 43 మందిని కేటాయించారు. మాస్‌కాపీయింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌ఐవో తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని ఫ్లయింగ్‌స్కా ్వడ్ బృందాలు 2, ఆరు సిట్టింగ్ స్కా ్వడ్ బృందాల తనిఖీలు చేయనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన హైపవర్ కమిటీ అందుబాటులో ఉంటుంది. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు. విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్‌ఐవో తెలిపారు. అలాగే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు లోకేషన్ మ్యాప్‌ను అందుబాటులో తీసుకొచ్చినందుకు విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్‌తో సెంటర్లు సులువుగా తెలుసుకోవచ్చును.
మార్చి 9న పరీక్ష 19 తేదీకి మార్పు
మార్చి 9వ తేదీన నిర్వహించవల్సిన సెకండరీయర్ గణితం–2, జువాలాజీ, హిస్టరీ పరీక్షలు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 19వ తేదీన నిర్వహించనున్నారు. విద్యార్థులకు పాత పరీక్ష కేంద్రాలలోనే పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఏమైన సందేహాలు ఉంటు 08462–245333 నెంబర్లకు సంప్రదించవచ్చును.
నిమిషం ఆలస్యమైనా..
Published Wed, Mar 1 2017 2:23 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
Advertisement
Advertisement