Testing Center
-
కొత్తగా నాలుగు డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 4 కొత్త డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్ ఆధునీకరణతో పాటు కొత్త ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మషల్కర్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను పెంచేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం 71 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారని, అదనంగా కనీసం 150 (అదనంగా ఇంకో 80 పోస్టులు) మంది అవసరం అని అధికారులు మంత్రికి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి అవసరమైన మేర పోస్టులు మంజూరు చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ (డీసీఏ) అధికారులు, తెలంగాణ మెడికల్ సరీ్వసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎంసీఐడీసీ) అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నాసిరకం, నకిలీ మందులు తయారు చేసే సంస్థలపై, వాటిని విక్రయించేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫార్మా కంపెనీలు, ఔషధ తయారీ యూనిట్లు, మందుల దుకాణాల్లో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లలో ఫిర్యాదుల విభాగాలు (కంప్లైంట్ సెల్స్), వీటి ఆకస్మిక తనిఖీల కోసం రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేసే మందుల కొనుగోలు విషయంలో టీజీఎంఎస్ఐడీసీకి అవసరమైన సహకారం అందించాలని డీసీఏ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, డీసీఏ డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ సహదేవరావు, డీసీఏ జాయింట్ డైరెక్టర్ జి.రాందాన్ తదితరులు పాల్గొన్నారు. -
కరోనా కట్టడికి మరో వంద కోట్లు
సాక్షి, సిద్దిపేట: కరోనా వైద్యం కోసం ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో కోవిడ్ మొబైల్ టెస్టింగ్ వాహనాన్ని, ఎన్సాన్పల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే వంద కోట్లు కేటాయించారని, ప్రస్తుతం మరో వంద కోట్లు అదనంగా కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేట వైద్య కళాశాలకు ఆర్టీపీసీఆర్ (కోవిడ్ టెస్టింగ్) అనుమతి రావడం గొప్ప విషయమని చెప్పారు. -
నిమిషం ఆలస్యమైనా..
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలి.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఈ–హాల్‌టికెట్లు చెల్లుబాటు సందేహాలుంటే సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 08462–245333 నిజామాబాద్ అర్బన్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, 18వ తేదీ వరకు కొనసాగుతాయని, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి ఒడ్డెన్న తెలిపారు. గురువారం నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్ష కేంద్రానికి ఆరగంట ముందుగానే చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడదని అధికారులు పేర్కొంటున్నారు. సర్వం సిద్ధం జిల్లాలో 43 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 18,101 మంది జనరల్ విద్యార్థులు, 1,607 మంది వోకేషన్ విద్యార్థులు మొత్తం 19,708 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో రెగ్యులర్ విద్యార్థులు 15,649, ప్రైవేట్ విద్యార్థులు 2,440 మంది.. మొత్తం 18,089 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 1,321, ప్రైవేట్ విద్యార్థులు 177 మంది మొత్తం 1,498 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం మొత్తం మంది విద్యార్థులు 39,295 మంది విద్యార్థులు ఉన్నారు.ప్రభుత్వ కళాశాలలు 17 సెంటర్లు, ఎయిడెడ్–2, రెసిడెన్షియల్–2, మోడల్ స్కూళ్లు–2, ప్రైవేట్‌లో–19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 1,007 ఇన్విజిలేటర్లను కేటాయించారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 43 మందిని కేటాయించారు. మాస్‌కాపీయింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్ఐవో తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని ఫ్లయింగ్స్కా ్వడ్ బృందాలు 2, ఆరు సిట్టింగ్ స్కా ్వడ్ బృందాల తనిఖీలు చేయనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన హైపవర్ కమిటీ అందుబాటులో ఉంటుంది. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు. విద్యార్థులు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్ఐవో తెలిపారు. అలాగే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు లోకేషన్ మ్యాప్‌ను అందుబాటులో తీసుకొచ్చినందుకు విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్‌తో సెంటర్లు సులువుగా తెలుసుకోవచ్చును. మార్చి 9న పరీక్ష 19 తేదీకి మార్పు మార్చి 9వ తేదీన నిర్వహించవల్సిన సెకండరీయర్ గణితం–2, జువాలాజీ, హిస్టరీ పరీక్షలు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 19వ తేదీన నిర్వహించనున్నారు. విద్యార్థులకు పాత పరీక్ష కేంద్రాలలోనే పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఏమైన సందేహాలు ఉంటు 08462–245333 నెంబర్లకు సంప్రదించవచ్చును. -
47 గ్రామాల్లో తాగునీరు కలుషితం
విజయనగరం ఆరోగ్యం :మనిషికి జీవనాధారమైన తాగునీరు కాలక్రమేనా కలుషితమవుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఆ నీటినే తాగాల్సిన దుస్థితి నెలకొంది. నీటి పరీక్ష కేంద్రం పరీక్షల్లో జిల్లాలో చాలా గ్రామాల్లో తాగునీరు కలుషితమైనట్లు నిర్ధారణ జరిగింది. తాగునీటిని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయకపోవడం వల్లే నీరు కలుషితమవుతున్నట్లు తెలుస్తోంది. తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నా అది కార్యరూపం దాల్చలేదు. పది నెలలో కాలంలో జిల్లాలో 47 గ్రామాల్లో తాగునీరు కలుషతమైనట్లు విశాఖపట్నానికి చెందిన నీటి పరీక్ష కేంద్రం అధికారులు నిర్ధారించారు. ప్రతీ నెలా నీటి నమూనాల సేకరణ.. హెల్త్ సూపర్వైజర్ల ద్వారా వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రతి నెలా నీటి నమూనాలను తెప్పిస్తారు. వాటిని విశాఖలోని నీటి పరీక్ష కేంద్రానికి పంపిస్తారు. అక్కడ అధికారులు నీరు కలుషితమా, కాదా అని నిర్ధారిస్తారు. నీరు కలుషితమూతే ఆర్డబ్ల్యూఎస్ శాఖాధికారులకు సమచారం అందించి నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తారు. కలుషిత నీరున్న గ్రామాలు... మెంటాడ మండలంలోని మెంటాడ గ్రామం, కురుపాం మండలం సీమలగూడ, డెంకాడ మండలం జొన్నాడ, గురుగుబిల్లి మండలం లఖనాపురం, నడిమివరివలస, పార్వతీపురం మండలం బందలుప్పి,వీరభద్రపురం, నర్సిపురం, ఎల్.కోట మండలం లచ్చంపేట, ఎల్.కోట, భోగాపురం మండలం బెరైడ్డిపాలెం, సాలురు మండలం మామిడిపేట, కొమరాడ మండలం కొమరాడ, కొట్టకి, రామభద్రపురం మండలం జొన్నవలస,నాయుడువలస, విజయనగరం మండలం సారిక, డెంకాడ మండలం అయినాడ,అక్కులపేట, గరివిడి మండలం కోనూరు,పర్ల, కొమరాడ మండలం బూరివలస, పెదశాఖ, కొండశాఖ, మెంటాడ మండలం పిట్టాడ, గుమ్మలక్ష్మీపురం మండలం కన్యగూడ, మక్కువ మండలం వీరభద్రపురం, బొండపల్లి మండలంలోని చలుమూరివీధి, ఎస్.కోట మండలం భీమవరం, కొమరాడ మండలం గాంధీనగరం, కొమరాడ మండలం పోకిరి, గజపతినగరం మండలం రంగాపురం, పాచిపెంట మండలం తడిలోవ, మక్కువ మండలం గొల్లవీధి, మూడంగి, మెంటాడ మండలం లక్ష్మీపురం, గుర్ల, తదితర 47 గ్రామాల్లో నీరు కలుషితమైందని అధికారులు నిర్థారించారు.