ల్యాబ్‌ను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: కరోనా వైద్యం కోసం ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో కోవిడ్ మొబైల్ టెస్టింగ్ వాహనాన్ని, ఎన్సాన్‌పల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే వంద కోట్లు కేటాయించారని, ప్రస్తుతం మరో వంద కోట్లు అదనంగా కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేట వైద్య కళాశాలకు ఆర్టీపీసీఆర్ (కోవిడ్ టెస్టింగ్) అనుమతి రావడం గొప్ప విషయమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment