సాక్షి, హైదరాబాద్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు మార్చి 2 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు షిప్టుల్లో జరిగే ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఆర్.సురేందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
డ్రాయింగ్ లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు మార్చి 2 నుంచి 5వ తేదీ వరకు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ పరీక్షలు మార్చి 2న, టైలరింగ్, ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు మార్చి 3 నుంచి 4వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అభ్యర్థులకు హాల్‌టికెట్లు పంపిణీ చేశామని, హాల్‌టికెట్లు అందని వారు bse. telangana. gov. in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
‘టెక్నికల్ కోర్సు’ పరీక్షలు మార్చి 2 నుంచి
Published Sun, Feb 19 2017 1:10 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM
Advertisement
Advertisement