ఆన్‌లైన్లో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం హాల్ టికెట్లు
Published Tue, Dec 17 2013 1:46 AM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM
సాక్షి, హైదరాబాద్: ప్రింట్, టీవీ, వెబ్ జర్నలిజం విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ఈ నెల 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 22 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. దీనికి సుమారు ఏడు వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ హాల్‌టికెట్లను sakshischoolofjournalism.com వెబ్‌సైట్లో ఉంచామని సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపల్ తెలియజేశారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబరు సాయంతో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబరు మరచిపోతే పుట్టినతేదీ, ఈ-మెయిల్ ఐడీల ఆధారంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండు దశల్లో జరిగే ఈ ప్రవేశ పరీక్ష మోడల్ ప్రశ్నపత్రాలు సైతం వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి.
Advertisement
Advertisement