రెగ్యులర్ విద్యార్థికి ఓల్డ్ పేపర్
కేయూ డిగ్రీ పరీక్షలో ఘటన
హాల్‌టికెట్‌లో ఎక్స్ స్టూడెంట్ అని తప్పు దొర్లడమే కారణం
కేయూ క్యాంపస్ : కేయూ పరీక్షల విభాగం తప్పు ఓ డిగ్రీ విద్యార్థిని ఇరకాటంలో పడేసింది. హాల్‌టికెట్‌లో ఎక్స్‌స్టూడెంట్‌గా తప్పు దొర్లడంతో రెగ్యులర్ ప్రశ్నపత్రం ఇవ్వకుండా.. ఓల్డ్‌పేపర్ ఇవ్వడమే ఇందుకు కారణం. విద్యార్థి కథనం ప్రకారం... హన్మకొండలోని న్యూసైన్స్ డిగ్రీ కాలేజీలో కె.సందీప్ డిగ్రీ బీకాం కంప్యూటర్స్ కోర్సు సెకండియర్ చదువుతున్నాడు. హన్మకొండలోని కాకతీయ మ హిళా డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రం కేటాయించారు. ఈ నెల 19న ఇంగ్లిష్ సబ్జెక్టు పేపర్‌తో పరీక్షలు ప్రారంభమయ్యాయి.
సందీప్ పరీక్ష రాసేందుకు కాకతీయ మహిళా డిగ్రీ కళాశాలకు వెళ్లగా అక్కడ ఇన్విజిలేటర్ ఇంగ్లిష్ ఎక్స్‌స్టూడెంట్‌కు ఇచ్చే ఓల్డ్ ప్రశ్నపత్రం ఇచ్చారు. తాను రెగ్యులర్ స్టూడెంట్‌నని, ఈ మేరకు ప్రశ్నపత్రం ఇవ్వాలని కోరారు. అందుకు ఇన్విజిలేటర్ హాల్‌టికెట్‌పై ఎక్స్ స్టూడెంట్ అని ఉందని.. తామే ఏం చేయలేమని చెప్పా డు. దీంతో అతడు పరీక్ష సరిగ్గా రాయలేకపోయూడు. శుక్రవారం యూనివర్సిటీలోని సం బంధిత అధికారులను సంప్రదించగా... మీరు చది విన కాలేజీకి వెళ్లి సరిచేయించుకోవాలని సూచిం చారు. దీంతో అతడు న్యూసైన్స్ డిగ్రీకాలేజికి వెళ్లి సరిచేరుుంచుకున్నాడు.పరీక్షల విభాగం నుంచి వచ్చి న హాల్‌టికెట్‌లో తప్పు దొర్లడం వల్ల తాను ఇంగ్లిష్ పరీక్ష సరిగా రాయలేకపోయూనని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయూలని వేడుకున్నాడు.