స్కూల్లో టీచర్ అవమానించిందని.. 30 ఏళ్ల తర్వాత.. 101 సార్లు పొడిచి..
బ్రస్సెల్స్: చిన్నప్పుడు స్కూల్లో అవమానించిందని ఓ వ్యక్తి టీచర్‌పై కక్ష్య పెంచుకున్నాడు. ఏడేళ్ల వయసులో జరిగిన అవమానానికి దాదాపు 30 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు. గుంటెర్ ఉవెంట్స్ అనే 37 ఏళ్ల వ్యక్తి 2020లో టీచర్‌ను హత్య చేశాడు. ఏకంగా 101 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘోర ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బెల్జియం పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు.
కాగా 2020లో ఆంట్వెర్ప్ సమీపంలో మారియా వెర్లిండెన్ అనే 59 ఏళ్ల టీచర్‌ను హత్య చేశారు. 101 సార్లు పొడిచి చంపారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు బెల్జియం పోలీసులు దాదాపు 100 మంది అనుమానితుల డీఎన్ఏలను పరీక్షించారు. అయినా కేసును చేధించలేకపోయారు. అయితే మహిళ మృతదేహం పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్‌పై ఉన్న నగదు అలాగే ఉండటంతో ఆమెను డబ్బుల కోసం హత్య చేయలేదనే నిర్ధారణకు వచ్చారు.
చదవండి: భార్యను వదిలేసి స్వాతి టీచర్‌తో నాయ్యవాది.. చిత్ర హింసలు.. కాదు కిడ్నాప్!
అయితే హత్య జరిగిన 16 నెలల తర్వాత, ఉవెంట్స్ టీచర్‌ను హత్య చేసిన విషయం తన స్నేహితుడి దగ్గర చర్చించాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఉవెంట్స్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో లభించిన క్లూతో నిందితుడి డీఎన్ఏను పరీక్షించగా అతనే నేరం చేసినట్లు తేలింది. అంతేగాక నిందితుడు హతురాలి పూర్వ విద్యార్ధి అని తేలింది. తనను అవమానించినందుకే టీచర్‌ను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. 1990లో తన ఏడేళ్ల వయస్సులో పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలో టీచర్ మారియా వెర్లిండెన్ తన గురించి చేసిన వ్యాఖ్యలను ఇప్పటి వరకు మరిచిపోలేదని చెప్పాడు.
చదవండి: ఎవరినీ లెక్కచేయని పుతిన్.. బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు.. రష్యా అభ్యంతరం