నేడు వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్ష | today test in VRA & VRO | Sakshi
Sakshi News home page

నేడు వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్ష

Published Sun, Feb 2 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

today test in VRA & VRO

  •     ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  •      200 కేంద్రాలు.. 80,758 అభ్యర్థులు
  •  కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఏపీపీఎస్సీ ద్వారా జిల్లా లో ఆదివారం నిర్వహిస్తున్న వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పా ట్లు పూర్తిచేసింది. మొత్తం వరంగల్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రదేశాల్లో 200 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీఆర్వో పరీక్షకు 75179, వీఆర్‌ఏ పరీక్షకు 4579 అభ్యర్థులు హాజరుకానున్నారు. మొత్తం 62 వీఆర్వో, 177 వీఆర్‌ఏ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తున్నారు.

    అభ్యర్థులకు సూచనలు, పాటించాల్సిన నియమాలపై అధికారులు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన జారీచేశారు. పరీక్షాకేంద్రాలు, హాల్‌టికెట్ల విషయంలో సహాయం కోసం కలెక్టరేట్‌లోని టోల్ ఫ్రీ నెంబర్ 18004252757తోపాటు 0870-2510777 నంబర్లు అందుబాటులో ఉంటాయని డీఆర్వో సురేందర్ కరణ్ తెలిపారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష ప్రారంభమయ్యాక లోపలికి అనుమతించరని ఆయన స్పష్టం చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement