హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో దోషుల అప్పీళ్లపై విచారణ పూర్తయ్యే వరకు ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేసి బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తీర్పు ఈ నెల 11కు వాయిదా పడింది. శిక్ష అమలును నిలిపివేయాలని, జరిమానా కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నందున దాని నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో రామలింగరాజు సహా ఇతర దోషుల తరఫు న్యాయవాదులు ఇప్పటికే వాదనలు వినిపించారు. దీనిపై శుక్రవారమే తన నిర్ణయాన్ని వెలువరిస్తామని జడ్జి చెప్పినప్పటికీ తీర్పు ప్రతి సిద్ధంకాకపోవడంతో కేసును వాయిదా వేశారు.