‘రద్దు’ తర్వాత హైదరాబాద్‌లోనే భారీగా బంగారం కొనుగోళ్లు
‘రద్దు’ తర్వాత హైదరాబాద్‌లోనే భారీగా బంగారం కొనుగోళ్లు
Published Sun, Dec 18 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM
- కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
ఉంగుటూరు: నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తరువాత దేశంలోని మిగతా ప్రాంతాలకంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది బంగారం కొన్నారని, వారి వివరాలన్నీ తమ దగ్గరున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో విలేకరుస మావేశంలో మాట్లాడిన ఆయన.. కరెన్సీ రద్దును విప్లవాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. కేంద్రప్రభుత్వం అవినీతిపై పోరాడుతున్నదని, జనవరి నాటికి పరిస్థితులు మెరుగుపడతాయని అన్నారు.
దేశంలో పెద్ద ఎత్తున నల్లధనం పేరుకుపోయిందని, పొరుగు దేశంలో దొంగనోట్లు ముద్రించి టెర్రరిస్ట్, డ్రగ్స్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని వెంకయ్య చెప్పారు. కొంతమంది బ్యాంకు ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని, దీనిని మార్చుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను రెచ్చకొడుతున్నాయని విమర్శించారు. వ్యక్తిగత ఖాతాల్లో రూ.2.50 లక్షల వరకు డబ్బుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదని, అంతకు మించితేనే లెక్క చెప్పాల్సి ఉంటుందని అన్నారు. కాగా, జనవరి 8న ముప్పవరపు ఫౌండేషన్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెంకయ్యనాయుడు తెలిపారు.
Advertisement