తండ్రి మరణం.. ఆర్థికంగా చితికిన కుటుంబం.. భారమైన జీవితం.. ప్రతిభ ఉన్నా అడ్డొచ్చిన పేదరికం.. వెరసి ఆ చిన్నారి చదువుకు అర్ధాంతరంగా స్వస్తి పలికింది. పుస్తకాలు, పెన్నులు పట్టాల్సిన అమ్మారుు.. తరతరాలుగా వస్తున్న కల్లుగీత వృత్తిని ఎంచుకుని కత్తులు, మోకులు పట్టుకుంది. మొక్కవోని ధైర్యంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కుటుంబానికి అండగా నిలిచింది.
ముకరంపుర: మంథని మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన పెరుమాళ్ల మృదువర్షిణి 15 ఏళ్ల వయస్సులో తాటి చెట్లు ఎక్కి కల్లుగీస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వర్షిణి తండ్రి నర్సింహస్వామి 2006లో విద్యుత్ ప్రమాదానికి గురై మరణించారు. తల్లి శివకుమారి అనారోగ్యంతో బాధపడుతోంది.
సోదరుడు చిన్నవాడు కావడం తో కుటుంబ బాధ్యతలను మృదువర్షిణి స్వీకరించింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న బాలిక చిన్ననాటి నుంచి చదువుల్లో ముందుంది. తొమ్మిదో తరగతిలో 590 మార్కులు సాధించింది ప్రతిభ చాటుకుంది. ఉన్నతవిద్య అభ్యసించి ఉద్యోగం చేయూలనే ఆశ ఉన్నా.. కుటుంబ పోషణకు పదవ తరగతి మధ్యలోనే చదువు ఆపేసింది. తన చిన్నాన కొడుకు సతీష్ సమకూర్చిన తాటిచెట్లను సులభంగా ఎక్కే యంత్రం సహా యంతో ఆమె కులవృత్తిని చేపట్టింది. మృదువర్షిణి దీనగాథ తెలుసుకున్న తెలంగాణ గౌడ సంఘం ఆదుకునేం దుకు ముందుకు వచ్చింది.
శుక్రవారం సంఘం రాష్ట్ర అ ధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ హైదరాబాద్ నుంచి దు బ్బపల్లికి చేరుకుని తాత్కాలిక సహాయం కింద రూ.10 వేలు అందించారు. ఉన్నత చదవులు చదివించేందుకు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని గౌడసంఘం వసతిగృహంలో ఉచిత ప్రవేశం కల్పిస్తామన్నారు. ఆయన వెంట గౌడసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పులి లక్ష్మీపతిగౌడ్, జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్, నాయకులు వంగ లక్ష్మీపతిగౌడ్, ముంజ సతీష్‌గౌడ్ ఉన్నారు. దీనస్థితిలో ఉన్న మృదువర్షిణి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వారు కోరారు.
మృదువర్షిణి.. గీతమారాలి
Published Sat, Feb 14 2015 3:10 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement