
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు(బుధవారం) మహాశివరాత్రి సంబరాలు మిన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ‘ఈ దివ్యమైన ఉత్సవం మీ అందరికీ ఆనందం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని, అభివృద్ధి చెందుతున్న భారతదేశ సంకల్పాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. ఇదే నా ఆశ.. సర్వం శివమయం’ అని రాశారు.
सभी देशवासियों को भगवान भोलेनाथ को समर्पित पावन-पर्व महाशिवरात्रि की असीम शुभकामनाएं। यह दिव्य अवसर आप सभी के लिए सुख-समृद्धि और उत्तम स्वास्थ्य लेकर आए, साथ ही विकसित भारत के संकल्प को सुदृढ़ करे, यही कामना है। हर-हर महादेव! pic.twitter.com/4gYM5r4JnR
— Narendra Modi (@narendramodi) February 26, 2025
శివాలయాల్లో..
ఈ రోజు దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. అంతటా శివనామస్మరణలు వినిపిస్తున్నాయి. ఆలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్నాయి. మహాశివుని దర్శనం కోసం భక్తులు ఆలయాల మందు బారులు తీరారు. మహాశివునికి పూజలు చేస్తూ, అభిషేకాలు అందిస్తున్నారు.
మహాకుంభమేళాలో..
మహా కుంభమేళాలో నేడు చివరి పుణ్య స్నాన ఉత్సవం కొనసాగుతోంది. అంతటా హరహర మహాదేవ మంత్రోచ్ఛారణలు వినిపిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుండే భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు చేస్తున్నారు. భక్తులపై కుంభమేళా నిర్వాహకులు హెలికాప్టర్ నుండి పూల వర్షం కురిపించారు. ఈరోజు ఉదయం 6 గంటల సమయానికే 41 లక్షలకు పైగా భక్తులు సంగమంలో స్నానమాచరించారని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: చివరి పుణ్యస్నానాలకు పోటెత్తిన జనం.. తాజా ఫొటోలు