
నల్లగొండ రూరల్: అరవై ఏళ్లలో లేని అప్పులు మూడేళ్లలో రెట్టింపు అయ్యాయని ప్రభుత్వంపై టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ధ్వజమెత్తారు. అమరవీరుల స్ఫూర్తి యాత్ర శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ నుంచి ప్రారంభమై నారాయణపురం, మునుగోడు, చిట్యాల, కట్టంగూరు, నకిరేకల్ మీదుగా నల్లగొండకు చేరింది.
ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో, అంతకుముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని విమర్శించారు. అమరుల స్ఫూర్తియాత్రకు ప్రభుత్వం అనేక ఆటంకాలను కల్పిస్తోందన్నారు.అంతకుముందు అమరుడు శ్రీకాంతాచారి విగ్రహం వద్ద నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment