రచయితలు ఏమి రాయాలో, ప్రచురణ కర్తలు ఏం ప్రచురించాలో కూడా ప్రభుత్వాలే ఆదేశించే పరిస్థితులు ఏర్పడుతున్నాయా? ఇదే జరిగితే అర్థవంతమైన ప్రజాస్వామ్యంగా భారత్ తన ఉనికినే కోల్పోతుంది. మణిపూర్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశం ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుంది. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, భౌగోళిక అంశాలకు చెందిన ఏవైనా పుస్తకాలను ప్రచురించడానికి ముందు మణిపూర్ విద్యామంత్రి నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీకి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇది పుస్తకాలపై సెన్సార్‌షిప్ విధించటానికి చేసిన ప్రయత్నం మాత్రమే కాదు... రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛల ఉల్లంఘన కూడా! అయితే, నిర్దిష్టమైన పుస్తకాలను నిషేధించడానికి కూడా రాజ్యాంగం ప్రభుత్వానికి అనుమతినిస్తోంది. కానీ అది అచ్చయిన పుస్తకాలకే వర్తిస్తుంది. అంతేగానీ ప్రతి పుస్తకాన్నీ ప్రచురణకు ముందుగానే ప్రభుత్వానికి సమర్పించాలని దానర్థం కాదు. అయినా మన ప్రచురణకర్తలు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది పెద్ద ప్రశ్న.
ప్రపంచంలో చాలా భయంకరమైన ఘటనలు జరుగుతుంటాయనీ, ప్రతి ఒక్క ఘటనపై మనం దృష్టి పెట్టలేమనీ నాకు తెలుసు. కానీ కొన్ని సార్లు మనం చూడలేకపోయిన లేక విస్మరించిన విష యాలు రెండూ మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఒక్కోసారి స్వీయ ఓటమిలోకి కూడా మనల్ని నెడతాయి. ఈరోజు అలాంటి ఒక ఘట నపై నేను దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను.
సెప్టెంబర్ 15వ తేదీన మణిపూర్ ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, భౌగోళిక అంశాలకు చెందిన ఏవైనా పుస్తకాలను ప్రచురించడానికి ముందు వాటిని మణిపూర్ విద్యామంత్రి నేతృ త్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీకి సమ ర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. నిజం చెప్పా లంటే, ఇది పుస్తకాలపై సెన్సార్‌షిప్ విధించటానికి చేసిన ప్రయత్నం మాత్రమే కాదు... రాజ్యాంగం మనకు ప్రసాదించిన వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛల ఉల్లంఘన కూడా అవుతుందని ఆందోళన కలుగుతోంది.
రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, భౌగో ళిక అంశాలపై ప్రచురించిన కొన్ని పుస్తకాలు వాస్త వాలను వ్యక్తీకరించేలా ఉంటున్నాయి లేదా వివిధ సామాజిక బృందాల్లో శాంతియుత సహజీవనానికి విఘాతం కలిగించేవిగా ఉంటున్నాయని మణిపూర్ ప్రభుత్వం చెబుతోంది. ఇకనుంచి ఈ అంశాలపై రాసిన పుస్తకాలను రాష్ట్రంలోని వైస్‌చాన్సలర్లు, కాలేజీలు, యూనివర్సిటీల అధ్యాపకులు, మణి పూర్ ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ అధికారులతో కూడిన 15 మంది సభ్యుల కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది.
ఈ కమిటీ ఆమోదం లేకుండా ఏ పుస్తకాన్నయినా ప్రచురించినట్లయితే సంబంధిత చట్టప్రకారం శిక్షకు గురవుతారని ప్రభుత్వ ఆదేశం తెలిపింది. అయితే ఏ చట్టం కింద ఏ శిక్ష విధిస్తారనే విషయాన్ని అది నిర్దిష్టంగా పేర్కొనలేదు. అలాగే శిక్షకు గురయ్యేది రచయితా, లేక ప్రచురణకర్తా లేదా ఇద్దరూనా అనే విషయాన్ని కూడా స్పష్టంగా పేర్కొనలేదు.
ఇప్పుడు రాజ్యాంగం వైపు చూద్దాం. భారత సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రత ప్రయోజనా లను, శాంతిభద్రతలను దెబ్బతీసే రకం వాక్ స్వేచ్ఛపై హేతుపూర్వకమైన ఆంక్షలను విధించడా నికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (2) అనుమతిస్తోంది. ఇది నిర్దిష్టమైన పుస్తకాలను నిషే ధించేందుకు ప్రభుత్వాన్ని అనుమతిస్తోంది. దీనికి ఉదాహరణ ఏమిటంటే మహాత్మాగాంధీ హత్యపై కాల్పనిక చిత్రణకు సంబంధించి స్టేన్లీ వూల్పర్ట్ రాసిన ‘‘నైన్ అవర్స్ టు రామా’’ అనే పుస్తకాన్ని గతంలోనే నిషేధించారు. అంతమాత్రాన ప్రభు త్వంపైన పేర్కొన్న నాలుగు అంశాలపై రాసే ప్రతి పుస్తకాన్నీ ప్రచురణకు ముందుగానే ప్రభుత్వ కమి టీకి సమర్పించడాన్ని కూడా ఆర్టికల్ 19 (2) అనుమతిస్తుందా?
దీనికి సమాధానం నిస్సందేహంగా లేదు అనే చెప్పాలి. దీనికి సమాధానం అవును అయితే అర్థ వంతమైన ప్రజాస్వామ్యంగా భారత్ తన ఉనికిని కోల్పోతుంది. కాబట్టే మణిపూర్ ప్రభుత్వ ఆదేశం అసంబద్ధమైనదే కాదు... ఆమోదించతగినది కూడా కాదు. అందుకనే ఈ అంశాన్ని చేపట్టడంలో, తీవ్రంగా నిరసన తెలపడంలో మన వైఫల్యం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. అంతకు మించి భయ పెడుతోంది కూడా!
అయితే పూర్తిగా వాస్తవ విరుద్ధంగా రూపొంది, సమాజాన్ని చిక్కుల్లో పడేసి, విచ్ఛిన్న పరిచే పుస్తకాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యా తీసుకోకూడదని దీనర్థం కాదు. ప్రభుత్వం ఇలాంటి పుస్తకాలను సవరించుకోవాలని డిమాండ్ చేయవచ్చు. నిషేధించకూడదు, కానీ ప్రభుత్వం తలుచుకుంటే దానిమీద నిషే«ధం కూడా విధించ వచ్చు. అయితే ఇవన్నీ కూడా ఏ పుస్తకానికి ఆ పుస్తకానికి మాత్రమే విడిగా వర్తించే అంశాలు.
అదికూడా వాటిల్లో తప్పుందని తేలినప్పుడు! అంతేగానీ ప్రచురణకు ముందుగానే వ్యక్తులు రాసిన పుస్తకాలను కైవసం చేసుకుని, శోధించి, తర్వాత ఏది ప్రచురించవచ్చు, దేన్ని తిరస్కరించ వచ్చు అని నిర్ణయించే పనిని ప్రభుత్వం చేయ కూడదు. కానీ మణిపూర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశం సరిగ్గా దీన్నే ప్రతిపాదిస్తోంది.
కానీ ఒక్క సానుభూతి చూపడం మినహా, మన ప్రచురణకర్తలు ఎందుకు దీనిపట్ల మౌనంగా ఉన్నారు? వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతారనీ, ప్రభుత్వ ఆదేశాలపై లీగల్ చర్యకు సిద్ధమవుతారనీ భావించాను. అయితే నిజాయతీగా చెప్పాలంటే మణిపూర్‌లో కొద్దిమంది ప్రచురణ కర్తలు మినహా యిస్తే బడా ప్రచురణ సంస్థల్లో ఏ ఒక్కటీ మణి పూర్ ప్రభుత్వ ఆదేశాన్ని సవాలు చేసిన పాపాన పోలేదు.
బహుశా చిన్న స్థాయి ప్రచురణకర్తలకు ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావొచ్చు. దీని కయ్యే ఖర్చులను వారి పుస్తకాల ద్వారా రాబట్ట లేకపోవచ్చు. అయితే ప్రచురణ కర్తలు సామూహి కంగానే ఈ ఉక్కుపాదం మీద పోరాడవచ్చు. ఎందుకంటే వీరి హక్కులు, ప్రయోజనాలు మొత్తంగా ప్రమాదంలో పడుతున్నాయి మరి. ఆక్షేపణే లేకుండా వారు ప్రభుత్వ ఆదేశాన్ని ఆమోదించినట్లయితే (ప్రస్తుతానికి వారు ఆమో దిస్తున్నట్లే కనబడుతోంది) వారూ, వారి రచయి తలు కూడా నష్టపోతారు.
వారితోపాటు మనం కూడా నష్టపోతాం. పాఠకులుగా మనం చదవాలనుకునే, నేర్చుకోవాల నుకునే పుస్తకాలను ప్రభుత్వాలు నిరాకరిస్తాయి. మణిపూర్ ప్రభుత్వ ఆదేశం అందరిలాగే మనల్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి మన మీడియా ఎందుకు మౌనంగా ఉంటోంది అనేది ప్రశ్న. టీవీల్లో దీనికి వ్యతిరేకంగా ఆగ్రహపూరితమైన చర్చలు ఎందుకు జరగడం లేదు?
మన వార్తా పత్రికలు మండిపడుతూ సంపాదకీయాలు ఎందుకు రాయడం లేదు? వాళ్లకు పరిస్థితి అర్థం కాలేదా? లేక ఏం జరుగుతోందో వారికి నిజంగానే తెలియడం లేదా? వీటికి సమాధానాలు నాకు తెలీవు కానీ ఈ ప్రశ్నలన్నీ ప్రాసంగికత కలిగి నట్టివే! అందుకే నేటి పరిస్థితి చాలా నిస్పృహను కలిగిస్తోంది. చివరకు అది నా మిత్రుడు లేవనెత్తిన ప్రశ్న దగ్గర వచ్చి ఆగింది. చివరకు మనం ఇక్కడికి చేరామా అని ప్రశ్నించాడతను. నిజం చెప్పాలంటే, సమాధానం అవును అనే!
వ్యాసకర్త: కరణ్ థాపర్, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment