అరవై ఏళ్లలో లేని అప్పులు మూడేళ్లలో రెట్టింపు అయ్యాయని ప్రభుత్వంపై టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ధ్వజమెత్తారు. అమరవీరుల స్ఫూర్తి యాత్ర శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ నుంచి ప్రారంభమై నారాయణపురం, మునుగోడు, చిట్యాల, కట్టంగూరు, నకిరేకల్ మీదుగా నల్లగొండకు చేరింది.