న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. బొగ్గుని నల్ల బంగారంగా పేర్కొన్నారు. వాణిజ్య బొగ్గు గనుల ఏడో విడత వేలాన్ని రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ..
‘‘గడిచిన కొన్నేళ్లలో మన ఇంధన వినియోగం పెరిగింది. అది ఇక ముందూ వృద్ధి చెందుతుంది. ఈ అవసరాలను తీర్చేందుకు ఈ రోజు నుంచే చర్యలు తీసుకోవాలని’’ చెప్పారు. వ్యాపార సులభ తర నిర్వహణను ప్రోత్సహించేందుకు ముందస్తుగా ఉత్పత్తి ప్రారంభించిన వాటికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రాలకు చెల్లించే ఆదాయంలో 50 శాతాన్ని రాయితీగా ఇస్తున్నట్టు చెప్పారు. వచ్చే 40-50 ఏళ్లపాటు బొగ్గు వినియోగం కొనసాగుతుందని చెబుతూ.. భారీగా ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఇప్పటి వరకు ఆరు విడతల వేలంలో 87 బగ్గు గనులను వేలం వేశామని, ఇవన్నీ ఉత్పత్తి ఆరంభిస్తే ఏటా రూ.33,200 కోట్ల ఆదాయంతో పాటు లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. (రెడ్‌మి 12సీ, రెడ్‌మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే)
106 గనుల వేలం..
ఏడో విడతలో వేలానికి ఉంచిన 106 గనుల్లో 61 బ్లాక్‌లు పాక్షికంగా అన్వేషించినవి కాగా, 45 పాక్షికంగా బొగ్గు నిక్షేపాల గురించి అన్వేషణ నిర్వహించినవి. 95 నాన్ కోకింగ్ కోల్ గనులు అయితే, 10 లిగ్నైట్ గనులు ఉన్నాయి. ఈ గనుల నుంచి వెలికితీసే బొగ్గు వినియోగంపై ఎలాంటి ఆంక్షలను ప్రభుత్వం పెట్టలేదు. బొగ్గు రంగంలో ప్రైవేటు కంపెనీలూ తగిన అవకాశాలను సొంతం చేసుకునేందుకు కేంద్ర సర్కారు లోగడ ఈ రంగానికి సంబంధించి ద్వారాలు తెరవడం తెలిసిందే. మరోవైపు ఆరో విడతలో వేలం వేసిన 28 గనులకు సంబంధించి ఒప్పందాలపై బొగ్గు శాఖ సంతకాలు పూర్తి చేసింది. (సహారా కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఇన్వెస్టర్లకు చెల్లింపులు)
Comments
Please login to add a commentAdd a comment