నిత్యజీవితంలో మనం రోజూ 1, 2 , 5 రూపాయల నాణేలను చూస్తూనే ఉన్నాం, చలామణి చేస్తూనే ఉన్నాం. అయితే ఒక రూపాయి తయారు కావడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఐదు రూపాయలు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.
నిజానికి ఒక రూపాయి నాణేన్ని తయారు చేయడానికి 111 పైసలు (రూ.1.11), రెండు రూపాయల నాణెం కోసం రూ.1.28, ఐదు రూపాయల నాణెం తయారీకి రూ.3.68 ఖర్చు అవుతుంది. ఇక 10 రూపాయల నాణెం కోసం రూ.5.54 ఖర్చు అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించినట్లు సమాచారం. మొత్తం మీద ఒక రూపాయి తయారీకి.. ఒక రూపాయి కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: మొన్న వార్నింగ్.. ఇప్పుడు ఆఫీస్ స్పేస్ - టెక్ దిగ్గజం కొత్త వ్యూహం!
నాణేలు ముంబై, అలీపూర్ (కోల్‌కతా), సైఫాబాద్ (హైదరాబాద్), చెర్లపల్లి (హైదరాబాద్), నోయిడా (యుపి) లోని నాలుగు భారత ప్రభుత్వ మింట్‌లలో ముద్రిస్తారు. నాణేలు ఆర్‌బీఐ చట్టం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ద్వారా మాత్రమే చలామణి కోసం జారీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment