ఐర్లండ్ పరిధిలో ఉన్న దీవుల్లో స్థిరపడటానికి సిద్ధపడేవారికి అక్కడి ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. చాలా దీవులు జనాలు లేక కళ తప్పినట్లు ఉండటంతో, ఈ దీవులను జనాలతో కళకళలాడేలా చేయాలని ఐర్లండ్ ప్రభుత్వం తలపెట్టింది. ఈ దీవుల్లో స్థిరపడటానికి వచ్చేవారికి ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి, ఇతర అవసరాలకు 84 వేల యూరోలు (రూ.76.16 లక్షలు) ఇవ్వనున్నట్లు ఐర్లండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హీదర్ హంప్రీస్ ప్రకటించారు.
ఈ దీవుల్లో నివాసం ఉండేవారికి మంచి కెరీర్ అవకాశాలను కల్పిస్తామని ఆమె తెలిపారు. ఇక్కడ నివాసం ఉండేందుకు వచ్చేవారికి ఖాళీ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు జాతీయ దీవుల కార్యాచరణ ప్రణాళిక కింద ప్రభుత్వ గ్రాంటు చెల్లిస్తామని వెల్లడించారు.
చదవండి లాఠీ పట్టుకుని బోర్ కొట్టిందేమో! ఏకంగా గరిట పట్టుకుని..
Comments
Please login to add a commentAdd a comment