KGF Fame Prashanth Neel Deactivates His Twitter Account, Details Inside - Sakshi
Sakshi News home page

Prashanth Neel: యశ్‌కి బర్త్‌డే విషెస్‌ చెప్పి ట్రోల్స్‌ బారిన పడ్డ ప్రశాంత్‌ నీల్‌, దెబ్బకి ట్విటర్‌ క్లోజ్‌!

Published Tue, Jan 10 2023 6:38 PM

Prashanth Neel Deactivates His Twitter Account After Birthday Wish to Yash - Sakshi

కేజీయఫ్‌ సిరీస్‌తో ఒక్కసారిగా నేషనల్‌ స్టార్స్‌ అయిపోయారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, రాకింగ్‌ స్టార్‌ యశ్‌. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంతో ప్రశాంత్‌ నీల్‌ స్టార్‌ డైరెక్టర్‌గా మారాడు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌ ‘సలార్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమాకు కమిట్‌ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంత్‌ నీల్‌కు షాక్‌ తగిలింది. ఇటీవల రాఖీభాయ్‌ యశ్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పి ట్రోల్స్‌ బారిన పడ్డారు ఆయన.

చదవండి: శ్రీహాన్‌తో పెళ్లి ఎప్పుడో చెప్పిన సిరి!

ఆయన విషెస్‌ చెప్పిన తీరుపై కన్నడీగులు మండిపడ్డారు. దీంతో నెట్టింట ఆయనకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంతకి ఏం జరిగిందంటే.. జనవరి 8న కన్నడ స్టార్‌ హీరో యశ్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన పుట్టిన రోజు శుభకాంక్షలు తెలుపుతూ ప్రశాంత్‌ నీల్‌ ట్వీట్‌ చేశాడు. అయితే ఆ ట్వీట్‌ను ఆయన ఉర్దూ భాషలో చేశారు. దీంతో కన్నడ ప్రజలు, ప్రేక్షకులు ప్రశాంత్‌ నీల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కర్ణాటక చెందిన మీరు కన్నడలోనే ట్వీట్‌ చేయొచ్చు కదా’ అని ప్రశ్నిస్తున్నారు. 

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ అవార్డు ఖాయం, రాసిపెట్టుకొండి: హాలీవుడ్‌ నిర్మాత

‘అసలు ఉర్దూలో ఎందుకు ట్వీట్‌ చేశారు?’ అంటూ నెటిజన్లు ఆయనను ట్రోల్‌ చేశారు. ఈ క్రమంలో సడెన్‌ ఆయన ట్వీటర్‌ బ్లాక్ అయిపోయింది. ఆయన ట్విటర్‌ ఖాతా ఓపెన్‌ చేసి చూడగా ‘ఈ ఖాతా పని చేయడం లేదు’ అనే నోటిఫికేషన్ చూపిస్తోంది. దీంతో ఆయనకు వస్తున్న నెగిటివిటీ కారణంగానే ప్రశాంత్‌ నీల్‌ ట్విటర్‌ అకౌంట్‌ను డియాక్టివేట్‌ చేశారని అంత అభిప్రాయ పడుతున్నారు. అయితే దీనికి అసలైన కారణంగా మాత్రం తెలియదు. దీనిపై క్లారిటీ రావాలంటే స్వయంగా ప్రశాంత్‌ నీల్‌ నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement