ఎయిరిండియా అకౌంట్‌ హ్యాక్‌, విమానాలన్నీ రద్దు | Air Indias Twitter Account Hacked | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా అకౌంట్‌ హ్యాక్‌, విమానాలన్నీ రద్దు

Published Thu, Mar 15 2018 12:01 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

Air Indias Twitter Account Hacked - Sakshi

ఎయిరిండియా (ఫైల్‌ ఫోటో)

ముంబై : ఎయిరిండియా అధికారిక ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయింది. ఉదయం చాలా గంటల పాటు ఎయిరిండియా ట్విటర్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌ బారిన పడినట్టు ఈ విమానయాన సంస్థ తెలిపింది. హ్యాక్‌ అయిన తమ ట్విటర్‌ అకౌంట్‌ @airindiain లో టర్కిష్‌ భాషలో మెసేజ్‌లు పోస్టు అవుతున్నాయని ఎయిరిండియా అధికార ప్రతినిధి చెప్పారు. తమ అకౌంట్‌లో పోస్టు అయిన హానికరమైన కంటెంట్‌ అంతటిన్నీ తాము తొలగించనట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్విటర్‌ అకౌంట్‌ రిస్టోర్‌ అయిందని వెల్లడించారు. 

హ్యాకింగ్‌కు గురైన ఎయిరిండియా అకౌంట్‌లో పోస్టు అయిన ఒక మెసేజ్‌ ఈ విధంగా ఉంది. ''చివరి నిమిషంలో ఎంతో ముఖ్యమైన ప్రకటన. మా అన్ని విమానాలను రద్దు చేశాం. ఇప్పటి నుంచి, టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌తో మేము ఎగరాలనుకుంటున్నాం'' అని పోస్టు అయింది. ఈ మెసేజ్‌ చూసిన ఎయిరిండియా ట్విటర్‌ ఫాలోవర్స్‌ అందరూ ఒక్కసారిగా షాకింగ్‌కు గురయ్యారు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను ఇటీవల ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిరిండియా అధికారిక అకౌంట్‌లో ఈ మెసేజ్‌ కనిపించడం తీవ్ర గందరగోళానికి తెరతీసింది. ప్రస్తుతం ఎయిరిండియా ట్విటర్‌ అకౌంట్‌కు 1,46,000 మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement