పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య.. డాక్టర్ గురుప్రీత్ కౌర్(32) మరోసారి వార్తల్లో నిలిచారు. వివాహం జరిగిన మరుసటి రోజే ఆమె తన ట్విట్టర్ ఖాతాను నిలిపివేశారు. దీంతో, ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
కాగా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. గురువారం రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో, డాక్టర్ గురుప్రీత్ కౌర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. నెటిజన్లు ఆమె గురించి వివరాల కోసం తెగ వెతికేశారు. ఇదిలా ఉండగా.. వివాహం సందర్బంగా గురుప్రీత్ కౌర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మెహందీ, పెళ్లికి సంబంధించిన ఫొటోలను పోస్టు చేశారు. అంతేకాకుండా పెళ్లికి ముందు సీఎం మాన్, ఆయన తల్లి హర్పాల్ కౌర్‌తో దిగిన ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు.
అయితే, సీఎం మాన్ భార్య కావడం, ఎంతో ఫేమస్ అవడంతో ఆమె ట్విట్టర్ ఖాతాను ఫాలో చేసే వారి సంఖ‍్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక్కసారిగా ఆమె ట్విట్టర్ అకౌంట్ కనిపించకుండా పోయింది. దీంతో, సోషల్ మీడియాలో నెటిజన్లు ఖంగుతిన్నారు. ఆమె ఎందుకు ఇలా చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, ఫాలోవర్ల సంఖ్య పెరగడం కారణంగానే ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ అయినట్టు సమాచారం.
Dr. Gurpreet Kaur TDr. Gurpreet Kaur Twitter Account : ਭਗਵੰਤ ਮਾਨ ਦੀ ਪਤਨੀ ਡਾ. ਗੁਰਪ੍ਰੀਤ ਕੌਰ ਦੇ ਨਾਂ ‘ਤੇ ਬਣਿਆ ਟਵਿੱਟਰ ਅਕਾਊਂਟ ਸਸਪੈਂਡwitter Account : ਭਗਵੰਤ ਮਾਨ ਦੀ ਪਤਨੀ ਡਾ. ਗੁਰਪ੍ਰੀਤ ਕੌਰ ਦੇ ਨਾਂ ‘ਤੇ ਬਣਿਆ ਟਵਿੱਟਰ ਅਕਾਊਂਟ ਸਸਪੈਂਡ https://t.co/eJxCVX3wgK
— PREETNAMA (@preetchouhan346) July 8, 2022
ఇక, ట‍్విట్టర్ అకౌంట్ బ్లాక్ అవడంపై సీఎం మాన్ కానీ, ఆయన భార్య కానీ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. ఇక, డాక్టర్ గురుప్రీత్ కౌర్ 2018 నుంచి ట్విట్టర్‌లో యూజర్‌గా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. కానీ, రెండేళ్లలో ఆమె ప్రత్యేకంగా ట్వీట్ ఏమీ చేయలేదు, పోస్ట్‌లను మాత్రం రీట్వీట్ చేసింది. అదే సమయంలో, ఆమె తనను తాను రైతు కుమార్తెగా అభివర్ణించింది.
Comments
Please login to add a commentAdd a comment