Gurpreet Kaur
-
Gurpreet kaur: పెళ్లైన మరుసటి రోజే అకౌంట్ బ్లాక్ చేసిన సీఎం భార్య
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య.. డాక్టర్ గురుప్రీత్ కౌర్(32) మరోసారి వార్తల్లో నిలిచారు. వివాహం జరిగిన మరుసటి రోజే ఆమె తన ట్విట్టర్ ఖాతాను నిలిపివేశారు. దీంతో, ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కాగా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. గురువారం రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో, డాక్టర్ గురుప్రీత్ కౌర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. నెటిజన్లు ఆమె గురించి వివరాల కోసం తెగ వెతికేశారు. ఇదిలా ఉండగా.. వివాహం సందర్బంగా గురుప్రీత్ కౌర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మెహందీ, పెళ్లికి సంబంధించిన ఫొటోలను పోస్టు చేశారు. అంతేకాకుండా పెళ్లికి ముందు సీఎం మాన్, ఆయన తల్లి హర్పాల్ కౌర్‌తో దిగిన ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు. అయితే, సీఎం మాన్ భార్య కావడం, ఎంతో ఫేమస్ అవడంతో ఆమె ట్విట్టర్ ఖాతాను ఫాలో చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక్కసారిగా ఆమె ట్విట్టర్ అకౌంట్ కనిపించకుండా పోయింది. దీంతో, సోషల్ మీడియాలో నెటిజన్లు ఖంగుతిన్నారు. ఆమె ఎందుకు ఇలా చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, ఫాలోవర్ల సంఖ్య పెరగడం కారణంగానే ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ అయినట్టు సమాచారం. Dr. Gurpreet Kaur TDr. Gurpreet Kaur Twitter Account : ਭਗਵੰਤ ਮਾਨ ਦੀ ਪਤਨੀ ਡਾ. ਗੁਰਪ੍ਰੀਤ ਕੌਰ ਦੇ ਨਾਂ ‘ਤੇ ਬਣਿਆ ਟਵਿੱਟਰ ਅਕਾਊਂਟ ਸਸਪੈਂਡwitter Account : ਭਗਵੰਤ ਮਾਨ ਦੀ ਪਤਨੀ ਡਾ. ਗੁਰਪ੍ਰੀਤ ਕੌਰ ਦੇ ਨਾਂ ‘ਤੇ ਬਣਿਆ ਟਵਿੱਟਰ ਅਕਾਊਂਟ ਸਸਪੈਂਡ https://t.co/eJxCVX3wgK — PREETNAMA (@preetchouhan346) July 8, 2022 ఇక, ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ అవడంపై సీఎం మాన్ కానీ, ఆయన భార్య కానీ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. ఇక, డాక్టర్ గురుప్రీత్ కౌర్ 2018 నుంచి ట్విట్టర్లో యూజర్‌గా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. కానీ, రెండేళ్లలో ఆమె ప్రత్యేకంగా ట్వీట్ ఏమీ చేయలేదు, పోస్ట్‌లను మాత్రం రీట్వీట్ చేసింది. అదే సమయంలో, ఆమె తనను తాను రైతు కుమార్తెగా అభివర్ణించింది. -
కడుపులోని బిడ్డకు తండ్రివి కాదన్నందుకు..
వెల్లింగ్టన్: ప్రెగ్నెన్సీతో ఉన్న గాళ్‌ఫ్రెండ్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో భారతీయ విద్యార్థికి 17 ఏళ్ల కనీస శిక్షతో జీవిత కారాగార శిక్ష పడింది. మంగళవారం ఆక్లాండ్ హైకోర్టు జడ్జి మాథ్యూ పాల్మెర్ ఈ మేరకు తీర్పు చెప్పారు. ఆకాశ్ (24) అనే విద్యార్థి న్యూజిలాండ్‌లో చదువుకుంటున్నాడు. అతనికి గురుప్రీత్ కౌర్ (22) అనే గాళ్‌ఫ్రెండ్ ఉంది. వీరిద్దరూ ఏడాది పాటు రహస్యంగా డేటింగ్ చేశారు. కాగా గత ఏప్రిల్ 7న ఆకాశ్, కౌర్ ఘర్షణ పడ్డారు. తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రివి నీవు కావని, బంధాన్ని ఇంతటితో తెంచుకుందామని కౌర్.. ఆకాశ్‌కు చెప్పడంతో గొడవ మొదలైంది. తీవ్ర ఆగ్రహం చెందిన ఆకాశ్ కత్తి తీసుకుని 29 సార్లు కౌర్‌ను విచక్షణరహితంగా పొడిచి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి ఆక్లాండ్ దక్షిణ ప్రాంతంలో పొదల్లో పడేశాడు. కౌర్‌ను తాను హత్య చేయలేదని తొలుత బుకాయించిన ఆకాశ్ పోలీసులు విచారణలో నేరం అంగీకరించాడు. కోర్టు ఆకాశ్‌ను దోషిగా నిర్ధారించి శిక్షను ఖరారు చేసింది. -
సీఎం ఇంటిఎదుట మహిళ ఆత్మాహుతియత్నం
చండీఘర్: ఉద్యోగం రాకపోవడంతో నిరుత్సాహానికి గురైన 38 ఏళ్ల మహిళ చండీఘర్‌లోని పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్‌బాదల్ నివాసం ఎదుట ఆత్మాహుతియత్నం చేసింది. 40 శాతం కాలిన గాయాలైన బాధితురాలిని పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలని అమృత్‌సర్‌కు చెందిన గుర్ప్రీత్కౌర్గా గుర్తించారు. ఆమె వద్ద కంప్యూటర్ కోర్సు డిప్లమో సర్టిఫికెట్ ఉందని, కొద్ది రోజులుగా బాదల్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తోంద తెలిపారు. ఇది దురదృష్టకర సంఘటన అని సీఎం బాదల్ పేర్కొన్నారు. బాదల్ నగరంలో లేని సమయంలో బాధితురాలు ఆయనను కలిసేందుకు ప్రయత్నించిందని ఓ అధికారి చెప్పారు.