
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇటీవలె అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ తాజాగా సోషల్ మీడియాలో ప్రపంచంలోకీ అడుగుపెట్టారు. సోమవారం ఆమె పేరు మీద అధికారికంగా ట్విటర్ ఖాతాను ప్రారంభించారు. ప్రియాంక ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎలాంటి ఖాతా లేదన్న విషయం తెలిసిందే. అయితే ఆమె ట్విటర్‌ను ప్రారంభించిన కొద్ది గంటల్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగారు. మొదటి 15 నిమిషాల్లో ఆమెను అనుసరిస్తున్న వారిసంఖ్య ఐదు వేలకు చేరగా.. పది గంటల్లో వారిసంఖ్య లక్షకు చేరింది. ప్రియాంక గాంధీ ట్విటర్ ఖాతా ప్రారంభించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ స్పందించారు.
సోషల్ మీడియాలో కొత్త సూపర్ స్టార్ అడుగుపెట్టారంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రియాంక ఖాతాను ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకూ ఒక్క ట్వీట్ కూడా చేయ్యలేదు. ప్రస్తుతం ఆమె ఏడుగురిని అనుసరిస్తున్నారు. రాహుల్ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా, రణదీప్ సుర్జేవాలా, అహ్మాద్ పటేల్, అశోక్ గెహ్లోట్, సచిన్ ఫైలెట్‌లను ఆమె ఫాలో అవుతున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టాప్‌లో ఉండగా, శశిథరూర్ రెండవ స్థానంలో ఉన్నారు. ఇక తాజా గణాంకాల ప్రకారం ట్విటర్ ద్వారా రాహుల్‌గాంధీకి 8.48 మిలియన్లు, శశి థరూర్‌కి 6.75 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.
Pleased to welcome @priyankagandhi to @twitter. It was once a lonely furrow for a Congressman to plough — glad to see @INCIndia stalwarts now all take to it with enthusiasm.
— Shashi Tharoor (@ShashiTharoor) February 11, 2019