
సాక్షి, స్పోర్ట్స్ : రాజ్యాంగ పిత అంబేద్కర్‌ను అవమానించేలా ట్వీట్ చేశాడంటూ ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జోధ్‌పూర్(రాజస్థాన్) ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడో ట్విస్ట్ బయటపడింది.
ఆ పోస్ట్ అయ్యింది హర్దిక్ అఫీషియల్ అకౌంట్ నుంచి కాదన్నది ఇప్పుడు తేలింది. హర్దిక్ పాండ్యా అసలు ట్విట్టర్ అకౌంట్ యూజర్ నేమ్ @hardikpandya7 ఉండగా.. ఆ పోస్ట్ మాత్రం @sirhardik3777 పేరుతో ఉంది. పైగా పోస్ట్ చేసిన ఆ అకౌంట్ డిలేట్ అయి ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో అది ఫేక్ అకౌంట్ కావటంతో కేసు వీగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నది నిపుణులు చెబుతున్న మాట.