జైల్లో వేసిన నకిలీ ట్వీట్ | Fake Tweet Mumbai Police Arrested Haryana Man In Mumbai | Sakshi
Sakshi News home page

జైల్లో వేసిన నకిలీ ట్వీట్

Published Wed, Feb 10 2021 8:31 AM | Last Updated on Wed, Feb 10 2021 8:37 AM

Fake Tweet Mumbai Police Arrested Haryana Man In Mumbai - Sakshi

సాక్షి, ముంబై: సినిమా థియేటర్‌లో బాంబు ఉందని నకిలీ ట్వీట్‌ పోస్ట్‌ చేసిన ఓ యువకున్ని ముంబై సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితున్ని హరియాణాకు చెందిన బన్వారి సింగ్‌గా గుర్తించారు. వివరాలు.. జనవరి చివరి వారంలో ‘మేడం చీఫ్‌ మినిస్టర్‌’ సినిమా ప్రదర్శించే ఓ థియేటర్‌లో బాంబు పేలుస్తామని బన్వారి సింగ్‌ ట్వీట్‌ చేశాడు. అందుకు బన్వారీ కమాండో సింగ్‌ పేరుతో ట్విటర్‌లో అకౌంట్‌ తెరిచాడు. అదే పేరుతో బాంబు పేలుస్తామనే సందేశాన్ని పోస్టు చేయడంతో ముంబై సైబర్‌ క్రైం పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

వెంటనే ఆ సినిమా థియేటర్‌లో అనువనువు గాలించగా ఎక్కడా బాంబు దొరకలేదు. దీంతో ఇది ఫేక్‌ సందేశమని నిర్ధరణకు వచ్చారు. కానీ, ఈ సందేశం పోలీసులు ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ సందేశం హరియాణా నుంచి కమాండో సింగ్‌ పేరుతో బన్వారి ట్విట్‌ చేసినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి ముంబైకి తీసుకొచ్చారు. బన్వారీపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: ఇప్పుడే పెళ్లి వద్దు.. నిందలు భరించలేను.. 

చదవండి: చుట్టూ సీసీ కెమెరాలు.. కానీ కారు మాయం..!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement