
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్.. ట్వీట్లను స్క్రీన్ షాట్లు తీయకండని యూజర్లను కోరుతోంది. స్క్రీన్ షాట్ తీసే బదులుగా ఆ ట్వీట్ షేర్‌చేయడం లేదా ఆ లింక్‌ని కాపీ చేసుకోమని పలువురు యూజర్లకు సూచిస్తోంది. దీని ద్వారా ట్విటర్‌ని మరింత మంది యూజర్లకు చేరువయ్యేలా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తోంది. దీనికి సంబంధించిన ట్వీట్‌ను సెక్యూరిటీ రిసెర్చర్, రివర్స్ ఇంజినీరింగ్ నిపుణులు జేన్ మంచున్ వాంగ్ మొదట షేర్ చేశారు. ప్రస్తుతం బీటా యూజర్లు ద్వారా షేర్ ట్వీట్, కాపీ లింక్ అనే రెండు కొత్త ఫీచర్లను ట్వీటర్ పరీక్షిస్తోంది.
త్వరలో మిగతా యూజర్లకు కూడా ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఆగస్టులో, మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఓ కొత్త ఫీచర్‌ని పరీక్షిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా యూజర్లు ఇతరులకు ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా, వారితో కూటా ట్వీట్‌లను పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ యూజర్లను ఆకట్టుకునేందుకు ముందు వరుసలో ట్వీటర్ ఉంటుంది. ఇటీవల తన వినియోగదారులకు ఎడిట్ ట్వీట్ బటన్‌ను వాడుకలోకి తీసుకువచ్చింది.
అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఎంపిక చేసిన దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. ట్విట్టర్ ప్రకటించిన మేరకు ఈ ఎడిట్ ఫీచర్ కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని ట్విట్టర్ బ్లూ వినియోగదారులు మాత్రం ఉపయోగించగలరు. ఈ ఫీచర్ త్వరలో యుఎస్‌కి వస్తుందని కంపెనీ తెలిపింది.
చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ!