బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ట్వీటర్ అకౌంట్‌ను నిర్వహిస్తున్న కీలక వ్యక్తి మెహిదీ మస్రూర్ బిశ్వాస్ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన బెంగళూరు సీనియర్ పోలీసు అధికారి బెదిరింపులు వచ్చాయి. తాము బిశ్వాస్‌ను పట్టుకున్నట్లు తాను ట్వీట్ చేయగా అజ్ఞాత వ్యక్తుల నుంచి హెచ్చరికలు వచ్చాయని డీసీపీ(క్రైం) అభిషేక్ గోయెల్ తెలిపారు. అరెస్టుకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ చేసిన ట్వీట్లను పట్టించుకోమని గోయెల్ చెప్పారు. కాగా, ఐఎస్‌ఐఎస్‌లోకి కొత్త వారిని ఆకర్షించేందుకు, రిక్రూట్ చేసుకునేందుకు అకౌంట్‌ను నిర్వహిస్తున్నట్లు బిశ్వాస్ తమ విచారణలో అంగీకరించాడన్నారు.