'షమీ విట్నెస్' పేరుతో ట్వీట్స్...! | the man behind top Islamic State Twitter account | Sakshi
Sakshi News home page

'షమీ విట్నెస్' పేరుతో ట్వీట్స్...!

Published Fri, Dec 12 2014 11:28 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

the man behind top Islamic State Twitter account

బెంగళూరు : ఐఎస్ఐఎస్ ట్విట్టర్ అకౌంట్ వెనుక బెంగళూరుకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ హస్తం ఉన్నట్లు బ్రిటన్ ఛానల్ 4 న్యూస్లో ప్రత్యేక కథనం వెలువడింది. 'షమీ విట్నెస్' పేరుతో ట్వీట్స్, తీవ్రవాద సంస్థలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు పేర్కొంది. 'షమీ విట్నెస్' పేరిట ఆతను నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాను 17,700 మంది ఫాలో అవుతున్నట్లు ఆ ఛానల్ వెల్లడించింది.

అలాగే జిహాదీలు, ఉగ్రవాద మద్దతుదారులు, నియామకాలు జరిపే వారికి ఈ ఖాతా ఒక వారధిగా మారిందని ఛానల్ 4 పేర్కొంది. అయితే ఈ కథనంపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement