ఇక ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం.. | Kalam's Twitter account to remain alive in new form | Sakshi
Sakshi News home page

ఇక ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం..

Published Tue, Jul 28 2015 2:25 PM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

ఇక ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం.. - Sakshi

ఇక ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం..

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించినా.. ఆయన అధికారిక ట్విట్టర్ అకౌంట్ కొత్త పేరుతో కొనసాగనుంది.

కోల్కతా: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించినా.. ఆయన అధికారిక ట్విట్టర్ అకౌంట్ కొత్త పేరుతో కొనసాగనుంది. కలాంకు సన్నిహితంగా ఉండే సహాయకుల బృందం..  'ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం' పేరుతో ట్విట్టర్ అకౌంట్ను కొనసాగించాలని నిర్ణయించారు.

డాక్టర్ కలాం ఆలోచనలు, పాఠాలు, ప్రణాళికలను ట్విట్టర్లో పంచుకుంటామని  ఆయన సహాయకులు చెప్పారు. కలాంతో సన్నిహితంగా ఉండే ఐఐఎం పూర్వ విద్యార్థి శ్రీజన్ పాల్ సింగ్.. ఈ ట్విట్టర్ అకౌంట్ బాధ్యతలు చూడనున్నారు. కలాం స్ఫూర్తిదాయక సందేశాలు, ఆయన ఉపన్యాసాలు ట్విట్ చేస్తారు. అలాగే కలాం రచనలు 'వింగ్స్ ఆఫ్ ఫైర్', 'ఇండియా 2020', 'ఇగ్నిటెడ్ మైండ్స్', 'అనదర్ బుక్', అడ్వాంటేజ్ ఇండియా' తదితర పుస్తకాలలోని ముఖ్యమైన వ్యాఖ్యాలను ట్విట్టర్లో ఉంచుతారు. ట్విట్లర్లో కలాంకు 14 లక్షల మందికిపైగా ఫాలోయర్స్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement