సాక్షి, హైదరాబాద్: తన పేరిట నకిలీ అఫిషియల్ ట్విటర్ అకౌంట్ నడుస్తోందని తెలుసుకుని సినీ నటుడు ఆలీ షాక్ తిన్నారు. వెంటనే సైబరాబాద్‌లోని క్రైమ్ డిపార్టుమెంటు డిప్యూటీ కమిషనర్ రోహిణి ప్రియదర్శినికి శనివారం ఫిర్యాదు చేశారు. (14 వేల మద్యం బాటిళ్లు ధ్వంసం)
2017 నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఆలీ పేరిట అధికారిక ట్విటర్ అకౌంట్‌ను నడుపుతున్నాడు. సందర్భానుసారంగా వీడియోలు, మెసేజ్‌లు పెడుతున్నాడు. పలువురు నటీనటులకు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెట్టాడు. ఆ అకౌంట్ తనది కాదని, తన పేరిట అకౌంట్ రన్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆలీ తన ఫిర్యాదులో కోరారు. (అమెజాన్ ఆపిల్ డేస్ సేల్ : తగ్గింపు ధరలు)
Comments
Please login to add a commentAdd a comment