![Ayyayo Vaddamma Viral Video Hyderabad City Police Used For Awareness - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/24/Hyderabad_City_Police_Twitt.jpg.webp?itok=3JuZdxpx)
Ayyayo Vaddamma Sukhibhava Video: శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాదు.. పౌరుల వ్యక్తిగత భద్రత కోసం పోలీస్ వ్యవస్థ అహర్నిశలు శ్రమించడం చూస్తున్నాం. దేశంలో పలు రాష్ట్రాల పోలీసులు జనాలతో కనెక్టివిటీ కోసం సోషల్ మీడియా విరివిగా వినియోగిస్తున్నారు కదా!. అందులో హైదరాబాద్ పోలీసులు సైతం డిఫరెంట్ పంథాలో అవేర్‌నెస్ కల్పిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాను కుదిపేస్తున్న ‘సుఖీభవ’ మీమ్‌ను సైతం ఇప్పుడు వాడేశారు.
సోషల్ మీడియాలో గత కొన్నిరోజులుగా ‘సుఖీభవ’ అనే వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. నల్లగుట్ట శరత్ అనే పిలగాడు ఓ టీ పౌడర్ యాడ్‌ను రీ-క్రియేట్ చేసి జోరుగా తీన్మార్ స్టెప్పులేయడం, అది కాస్త మీమ్స్ పేజీల ద్వారా ఇంటర్నెట్‌లో వైరల్ కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైజ్‌మనీ గెలిచారంటూ లింకులు పంపి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే వాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ మీమ్‌ను వాడేశారు. ‘అలాంటి లింక్స్ ఓపెన్ చేయకండి’ అంటూ ఒరిజినల్ యాడ్‌లోని స్క్రీన్ షాట్‌నే ఉపయోగించారు.
అలాంటి లింక్స్ ఓపెన్ చేయకండి.... #సుఖీభవ #sukhibhava #cybersafety #yoursafetyisourfirstpriority pic.twitter.com/1GZ2zAbl59
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) September 23, 2021
ఇక శరత్ వీడియో ఎప్పుడు, ఏ సందర్భంలో తీసిందో స్పష్టత లేనప్పటికీ.. విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలో టిక్‌టాక్, యూట్యూబ్ ఇంటర్వ్యూలతో ట్రోలింగ్‌కు గురైన ఈ యువకుడు.. ఇప్పుడు ఓవర్‌నైట్‌సెన్సేషన్ కావడం విశేషం. ముఖ్యంగా మీమ్స్ పేజీలు ఈ వీడియో ద్వారా ఫాలోవర్స్‌కి అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయి. సెలబ్రిటీలు, పొలిటీషియన్లను సైతం వదలకుండా ట్రోల్ చేస్తున్నారు మరికొందరు. చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఈ-సెలబ్రిటీగా బుల్లితెరపై శరత్ కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!!
E video monnatnunchi chusthunna ..navvu agatla 😂#Sukhibhava pic.twitter.com/cJljiuHrhY
— Teetotaler (@Imbuvan) September 20, 2021
Comments
Please login to add a commentAdd a comment