ఆలీ పేరిట నకిలీ ట్విట్టర్​ అకౌంట్​ | Hyderabad: Actor ali complains on fake twitter account on his name | Sakshi
Sakshi News home page

ఆలీ పేరిట నకిలీ ట్విట్టర్​ అకౌంట్​

Published Sat, Jul 18 2020 5:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

సాక్షి, హైదరాబాద్​: తన పేరిట నకిలీ అఫిషియల్​ ట్విట్టర్​ అకౌంట్​ నడుస్తోందని తెలుసుకుని సినీ నటుడు ఆలీ షాక్​ తిన్నారు. వెంటనే సైబరాబాద్​లోని క్రైమ్​ డిపార్టుమెంటు డిప్యూటీ కమిషనర్​ రోహిణి ప్రియదర్శినికి శనివారం ఫిర్యాదు చేశారు. 

2017 నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఆలీ పేరిట అధికారిక ట్విట్టర్​ అకౌంట్​ను నడుపుతున్నాడు. సందర్భానుసారంగా వీడియోలు, మెసేజ్​లు పెడుతున్నాడు. పలువురు నటీనటులకు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెట్టాడు. ఆ అకౌంట్​ తనది కాదని, తన పేరిట అకౌంట్​ రన్​ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆలీ తన ఫిర్యాదులో కోరారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement