ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తన లక్ష్యమని సినీనటుడు అలీ తెలిపారు. సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘1999లో ఓ పార్టీ తరఫున ప్రచారం చేశాను. మళ్లీ 2019లో ప్రచారం చేసి జగన్ సీఎం చేయాలనుకుంటున్నాను. ఆయన ఇచ్చిన మాటను తప్పరు. ప్రచారం చేసి మేజార్టీతో గెలిపించు. తర్వాత నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు.