
సాక్షి, హైదరాబాద్: కెనడాలో ఓ పంజాబీ కుటుంబం నడిరోడ్డుపై అల్లరి చేస్తుండటంతో వారిని హెచ్చరించడానికి పోలీసులు వచ్చారు. అయితే అలా వచ్చినవారు కూడా పంజాబీలు కావడంతో గలాటా చేస్తున్న వాళ్లు ఆనందంతో కేరింతలు కొట్టారు. పంజాబీ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
పంజాబీలను హెచ్చరించడానికి పంజాబీ పోలీసులే వస్తే కెనడాలో పరిస్థితి ఇలా ఉంటుందంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను పోస్టు చేశారు. 13 సెకండ్ల ఈ వీడియోలో సాటి పంజాబీ పోలీసులను చూసి ఆ పంజాబీ కుటుంబం ఉబ్బితబ్బిబ్బైపోవడం చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment