Punjabi family
-
ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాప్.. విషాద ముగింపు
కాలిఫోర్నియా: యూఎస్‌లో ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాప్ ఉదంతం.. విషాదంగా ముగిసింది. ఎనిమిది నెలల పసికందుతో సహా అంతా మృతదేహాలుగా కనిపించారని కాలిఫోర్నియా అధికారులు ప్రకటించారు. ఓ పండ్ల తోట నుంచి వీళ్ల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్ని జస్లీన్ కౌర్(27), జస్దీప్ సింగ్(36).. వీళ్ల ఎనిమిది నెలల పాప అరూహీ ధేరి, బంధువు అమన్‌దీప్ సింగ్(39)గా గుర్తించారు. సోమవారం నార్త్ కాలిఫోర్నియాలోని మెర్స్‌డ్ కౌంటీ నుంచి వీళ్లు అపహరణకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. వీళ్ల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. ఇంతలో.. బుధవారం సాయంత్రం ఇండియానా రోడ్& హచిన్సన్ రోడ్‌లోని ఓ పండ్ల తోటలో పని చేసే వ్యక్తి.. వీళ్ల మృతదేహాలను గుర్తించి తమకు సమాచారం అందించాడని మెర్స్‌డ్ కౌంటీ పోలీస్ అధికారి వెర్న్ వార్న్కె తెలిపారు. ఆ సమయంలో ఆ అధికారి భావోద్వేగానికి లోనయ్యారు. నిందితుడికి నరకమే సరైన శిక్ష అని అభిప్రాయపడ్డారాయన. ఇదిలా ఉంటే.. జస్దీప్ తన కుటుంబంతో సెంట్రల్ వ్యాలీలో నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 3వ తేదీన సౌత్‌హైవే 59లోని 800 బ్లాక్ వద్ద కొందరు దుండగులు ఆయుధాలతో బెదిరించి వీళ్లను అపహరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కుటుంబం కిడ్నాప్‌కు గురైన మరుసటి రోజే.. అనుమానితుడు మాన్యుయెల్ సల్గాడోను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జస్దీప్ తల్లిదండ్రులు డాక్టర్ రణ్‌దీర్ సింగ్, కృపాల్ కౌర్‌ల స్వస్థలం పంజాబ్. కిడ్నాప్ ఉద్దేశం కచ్చితంగా తెలియదని, కిడ్నాపర్ తాను దొరకకుండా సాక్ష్యాలు, ఆధారాలను నాశనం చేశాడని పోలీస్ అధికారులు తెలిపారు. నిందితుడి విచారణలో కారణాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: పిల్లల దగ్గు, జలుబు సిరప్‌లో కలుషితాలు! -
ఆరేళ్ళ అంబాసిడర్... జష్నీత్ కౌర్!
వేగంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనుషులు మారుతున్నారు. కానీ ఇప్పటికీ అమ్మాయి పుడితే ఆనందించే కుటుంబాలు కొన్నే కనిపిస్తాయి. ఈ కోవకు చెందిన పంజాబి కుటుంబంలో పుట్టింది జష్నీత్ కౌర్. ముద్దులొలికే మాటలు, చిరునవ్వుల ముఖంతో ఆకర్షణీయంగా ఉండడంతో జష్నీత్‌ను పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం.. ఎడ్యుకేషన్ అంబాసిడర్ గా ఎన్నుకుంది. దీంతో ఎక్కడ చూసినా తమ చిన్నారి ఫోటో కనిపించడంతో అమ్మాయి వద్దనుకున్న జష్నీత్ తల్లి.. మా అమ్మాయి అబ్బాయితో సమానం అని గర్వంగా చెబుతున్నారు. పంజాబ్‌లోని ఫరీద్కోట్ జిల్లా వారా భాయ్ కా గ్రామానికి చెందిన జగిత్ సింగ్, సుదీప్ కౌర్ దంపతులకు జష్నీత్ పుట్టింది. సుదీప్ ఇంటర్మీడియట్ వరకు చదివి గృహిణి గా ఇంటి బాధ్యతలు చూసుకుంటుంటే.. జగిత్ ఓ దారాల తయారీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సుదీప్ కడుపుతో ఉన్నప్పుడు తనకు అబ్బాయే పుట్టాలని కోరుకునేవారు. తొలి సంతానం కావడంతో ఆమె కొడుకు కావాలని, తనకి కొడుకే పుడతాడని ఆమె కలలు కనేవారు. కానీ చివరికి జష్నీత్ పుట్టింది. అమ్మాయి పుట్టిందని ఆమె చాలా బాధపడ్డారు. అయితే జష్నీత్ తండ్రి, తాత, నానమ్మలు మాత్రం నిరాశ చెందలేదు. జష్నీత్‌ను అల్లారుముద్దుగా చూసుకునేవారు. కానీ సుదీప్‌కౌర్‌కు మాత్రం ఆనందంగా ఉండేవారు కాదు. బాగా చదివించాలని.. ఒక్కగానొక్క కూతురు కావడంతో జష్నీత్‌ను ప్రైవేటు స్కూల్లో బాగా చదివించాలనుకున్నారు. కానీ గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూలు స్మార్ట్ స్కూల్‌గా మారడంతో ..ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న సదుపాయాలన్నీ ఇక్కడ కూడా ఉండడంతో జష్నీత్‌ను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్చారు. ఓ రోజు ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కృష్ణ కుమార్ ఆ స్కూల్ ను సందర్శించారు. జష్నీత్‌ను చూసిన ఆయన ఆమెతో మాట్లాడి ఫోటోలు తీసుకుని ఈ అమ్మాయి పంజాబ్ ఎడ్యుకేషన్ విభాగం బ్రాండ్ అంబాసిడర్ అని ప్రకటించారు. అప్పటి నుంచి ఎడ్యుకేషన్ ప్రకటనల్లో జష్నీత్ కనిపించడం ప్రారభమైంది. రాష్ట్రంలో ఏ న్యూస్ పేపర్, టీవీల్లో వచ్చే ప్రకటనలు, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఆరేళ్ళ అమాయకమైన ముఖం, కళ్లతో చిరునవ్వులు చిందిస్తూ స్కూలు యూనిఫాం, టై కట్టుకుని రిబ్బన్లతో కట్టిన రెండు జడల్ని ముందుకేసుకున్న ఫోటో ఎడ్యుకేషన్ విభాగం నిర్వహించే అనేక కార్యక్రమాలో 2018 నుంచి కనిపించేది. వాట్సాప్ డిస్లే్ప ఫోటోగానూ జష్నీత్ కనిపించడం విశేషం. ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లల్ని చేర్పించమని.. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మంచి విద్యను అందిస్తున్నాం అని ప్రభుత్వం తరుపున ప్రచారం చేస్తోంది జష్నీత్. ఈచ్ వన్, బ్రింగ్ వన్ (ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచే కార్యక్రమం), ఘర్ బైటే శిక్షా(ఆన్లైన్ ఎడ్యుకేషన్), లైబ్రరీ లాంగర్, మిషన్ సాత్ పరిషత్ వంటి కార్యక్రమాల్లో గత మూడేళ్లుగా జష్నీత్ ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? ఎంత అదృష్ట వంతురాలో అని అందరు అనుకుంటుంటే..జష్నీత్ తల్లి తెగ మురిసిపోతున్నారు. ‘‘జష్నీత్ పుట్టినప్పుడు అమ్మాయి పుట్టిందని చాలా బాధపడ్డాను. కన్నతల్లిగా కూతుర్ని అప్యాయంగా చూడలేకపోయాను. ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఎక్కడ చూసిన నా చిట్టి తల్లి ఫోటోలు కనిపిస్తున్నాయి. అందరికి జష్నీత్ ఎవరో తెలిసిపోయింది. నాకు కొడుకు వద్దు జష్నీతే అబ్బాయి తో సమానం’’ అని ఆమె చెప్పారు. -
జీలకర్ర... బెల్లం
కాజల్‌ది పంజాబీ కుటుంబం. ఆమె చేసుకున్న అబ్బాయి గౌతమ్‌ది కాశ్మీరీ ఫ్యామిలీ. ఈ పంజాబీ–కాశ్మీరీ వెడ్డింగ్‌లో సౌతిండియా మీద ప్రేమను చూపించారు కాజల్. జీలకర్ర బెల్లాన్ని తమ పెళ్లిలో భాగం చేశారు. నార్త్ పెళ్లిలో సౌత్ సంప్రదాయాన్ని కూడా పాటించారు. ఈ విషయం గురించి కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటూ – ‘‘గౌతమ్‌కు, నాకు సౌతిండియా మీద ఉన్న ప్రేమాభిమానాలే జీలకర్ర బెల్లాన్ని మా పెళ్లిలో భాగం చేశాయి. తెలుగు పెళ్లిలో వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. భార్యాభర్త కష్టనష్టాల్లోనూ కలిసే ఉండాలి అని చెబుతుంది జీలకర్ర బెల్లం’’ అని రాసుకొచ్చారు కాజల్. -
ఆ పోలీసులు మనవాళ్లయితే ఆ కిక్కే వేరబ్బ..
సాక్షి, హైదరాబాద్: కెనడాలో ఓ పంజాబీ కుటుంబం నడిరోడ్డుపై అల్లరి చేస్తుండటంతో వారిని హెచ్చరించడానికి పోలీసులు వచ్చారు. అయితే అలా వచ్చినవారు కూడా పంజాబీలు కావడంతో గలాటా చేస్తున్న వాళ్లు ఆనందంతో కేరింతలు కొట్టారు. పంజాబీ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పంజాబీలను హెచ్చరించడానికి పంజాబీ పోలీసులే వస్తే కెనడాలో పరిస్థితి ఇలా ఉంటుందంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను పోస్టు చేశారు. 13 సెకండ్ల ఈ వీడియోలో సాటి పంజాబీ పోలీసులను చూసి ఆ పంజాబీ కుటుంబం ఉబ్బితబ్బిబ్బైపోవడం చూడొచ్చు. -
ప్రతి భాషనూ నేర్చుకుని నటించాను
అంతర్వీక్షణం: రతీ అగ్నిహోత్రి రతీ అగ్నిహోత్రి అంటే... ప్రేమసింహాసనం, కలియుగరాముడు సినిమాల్లో ఎన్.టి. రామారావు పక్కన బంగారు తీగలా కనిపించిన అమ్మాయి. సత్యం శివంలో ఏఎన్నార్‌కి జోడీ. ఇంకా చెప్పాలంటే ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమాలో బాలకృష్ణ సరసన నటించి సినిమాకు డ్యూయెట్ల గ్లామర్నద్దిన రూపసి. మరోచరిత్రలో నటి సరిత నటించిన పాత్రను హిందీలో ‘ఏక్ తుజే కే లియే’ సినిమాతో దేశమంతటికీ పరిచయం చేసిన నటి. ఇవాళ రతి అగ్నిహోత్రి పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమె అంతర్వీక్షణం. పంజాబీ కుటుంబంలో పుట్టిన మీకు దక్షిణాది సౌకర్యంగా అనిపించిందా? మాది పంజాబీ కుటుంబమే అయినా నేను పుట్టేనాటికి మా కుటుంబం ముంబయిలో ఉండేది. నా స్కూలు రోజుల్లోనే నాన్నకు చెన్నైకి బదిలీకావడంతో ఆ వాతావరణం బాగా అలవాటైంది. నాకెప్పుడూ దక్షిణాది కొత్తగా అనిపించలేదు. నా పుట్టింటిలాగానే భావించాను. సినిమారంగంలో అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది? నేను చెన్నైలోని ‘గుడ్ షెఫర్డ్స్’ కాన్వెంట్లో చదువుకుంటున్నప్పుడు పాఠశాల వార్షికోత్సవంలో ఓ నాటకంలో నటించాను. ఆ సాంస్కృతిక కార్యక్రమాలకు వచ్చిన వారు దర్శకులు భారతీరాజా అనే విషయం కూడా తెలియదు. ఆయన నేరుగా నాన్నగారిని కలిసి తన సినిమాలో నటించమని అడిగినప్పుడు నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. భారతీరాజా వంటి పెద్దాయన అడగడంతో కాదనలేక నాన్న అయిష్టంగానే అంగీకరించారు. అన్ని దక్షిణాది భాషల్లోనూ నటించారు కదా! మరి అన్ని భాషలూ నేర్చుకున్నారా? ఇప్పుడెవరూ అంత పట్టుదలగా నేర్చుకుంటున్నట్లు కనిపించడం లేదు! భాష నేర్చుకుని డైలాగ్‌ని పలికితే నటనలో యాభై శాతం పాసైనట్లే. నేను ప్రతి భాషనూ నేర్చుకుని నటించాను. తెలుగు, కన్నడ బాగా మాట్లాడతాను. మలయాళం కూడా ఫర్వాలేదు ఓ మోస్తరుగా వచ్చు. హిందీ సినిమాల్లో కెరీర్ ఉన్నత స్థాయిలో ఉండగానే తెరమరుగయినందుకు తర్వాత చింతించారా? ఏ మాత్రం లేదు. అనిల్‌ని పెళ్లి చేసుకోవడం నేను ఇష్టపడి తీసుకున్న నిర్ణయం. పెళ్లి తర్వాత వైవాహిక జీవితానికి, కుటుంబానికి పరిమితం కావాలనేది కూడా నేను ఇష్టంగా తీసుకున్న నిర్ణయమే. పైగా అది అవసరమైన నిర్ణయం కూడా. మరి దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ నటించాలని ఎందుకనిపించింది? మా అబ్బాయి తనూజ్ పెద్దయ్యాడు. నాకు అవసరానికి మించినంత ఖాళీ సమయం ఉంది. ‘మళ్లీ నటించవచ్చు కదా’ అని మావారు, అబ్బాయి ఇద్దరూ ప్రోత్సహించడంతో అంగీకరించాను. ఆ పదిహేనేళ్ల కాలాన్ని వెనక్కి చూసుకుంటే మీకేమనిపిస్తోంది? ఆ విరామంలో నేను చాలా నేర్చుకున్నాను. మా వారు ఆర్కిటెక్ట్ కావడంతో ఆయన వృత్తి వ్యవహారాల్లో ల్యాండ్ స్కేప్ డిజైనింగ్ వంటి నాకు తోచినవేవో చేసేదాన్ని. గ్లాస్ పెయింటింగ్స్ వేశాను. శిల్పాల తయారీలో శిక్షణ తీసుకున్నాను. నేను సొంతంగా డ్రై ఫ్లవర్స్ తయారు చేస్తాను కూడా. వీటన్నింటితోపాటు ‘రేకీ’ అనే వైద్య ప్రక్రియలో కోర్సు చేశాను. వివాహం, భర్త ఎంపిక విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకున్నానని ఎప్పుడైనా అనిపించిందా? నా పెళ్లయి దాదాపు 30 ఏళ్లయింది. సరైన నిర్ణయం తీసుకున్నాననే విశ్వాసంతోపాటు జీవితాన్ని చక్కగా మలుచుకున్నాననే సంతోషం కూడా ఉంది.