
కాజల్‌ది పంజాబీ కుటుంబం. ఆమె చేసుకున్న అబ్బాయి గౌతమ్‌ది కాశ్మీరీ ఫ్యామిలీ. ఈ పంజాబీ–కాశ్మీరీ వెడ్డింగ్‌లో సౌతిండియా మీద ప్రేమను చూపించారు కాజల్. జీలకర్ర బెల్లాన్ని తమ పెళ్లిలో భాగం చేశారు. నార్త్ పెళ్లిలో సౌత్ సంప్రదాయాన్ని కూడా పాటించారు. ఈ విషయం గురించి కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటూ – ‘‘గౌతమ్‌కు, నాకు సౌతిండియా మీద ఉన్న ప్రేమాభిమానాలే జీలకర్ర బెల్లాన్ని మా పెళ్లిలో భాగం చేశాయి. తెలుగు పెళ్లిలో వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. భార్యాభర్త కష్టనష్టాల్లోనూ కలిసే ఉండాలి అని చెబుతుంది జీలకర్ర బెల్లం’’ అని రాసుకొచ్చారు కాజల్.
Comments
Please login to add a commentAdd a comment