ట్విటర్‌లో యమా యాక్టివ్‌గా ఉండే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ తన నాలుగేళ్ల కుమారుడు దేవాన్ష్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేస్తున్న ట్వీట్‌లు తీవ్రచర్చనీయాంశంగా మారాయి. తన కుమారుడు దేవాన్ష్‌ను(@naradevaansh) ట్యాగ్ చేస్తూ పలు సందర్భాల్లో లోకేశ్ ట్వీట్‌లు చేశారు. దేవాన్ష్ చాలా త్వరగా పెద్దవాడు అయిపోతున్నాడని, అతనితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానంటూ గురువారం ట్విటర్‌లో నారాలోకేశ్ పోస్ట్ పెట్టారు. దేవాన్ష్‌తో గడిపిన మధుర క్షణాలు, ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు.
ఇప్పటికే నారా దేవాన్ష్ పేరుతో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతోపాటూ వివిధ సామాజిక మాధ్యమాలలో కూడా అకౌంట్‌లు ఉన్నాయి. అయితే ఇవి అధికారిక అకౌంట్‌లా కాదా అనేదానిపై స్పష్టత లేదు. కానీ ఏకంగా నారా లోకేశే దేవాన్ష్ పేరుతో ఉన్న అకౌంట్‌ను పలు సందర్భాల్లో ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడంతో అది దేవాన్ష్ అకౌంటే అని స్పష్టమవుతోంది. ‘మనం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం అన్నదే ప్రధానంగా మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది’ అంటారు శంకరాచార్యుడు. చిన్న పిల్లలు తెలిసో తెలియకో సామాజిక మాధ్యమాలపై ఎక్కువగా దృష్టిపెడితే ఎదుగుదలలో బహు ముఖ వికాసం లోపించి, వృధా వ్యవహారాల్లో మునిగి తేలుతూ మేధోమరుగుజ్జుతనానికి లోనయ్యే అవకాశం ఉంది. అందుకే పలు సామాజిక వెబ్‌సైట్లలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీస వయసు ఉండాలనే నిబంధనలను పెట్టాయి. ట్విటర్ అకౌంట్ వాడాలంటే కనీస వయసు 13 ఏళ్లు ఉండాలనే నిబంధన ఉంది. ఈ విషయం కూడా తెలియకుండా ఏపీ ఐటీ మంత్రిగా ఎలా పని చేస్తున్నారంటూ లోకేశ్‌పై విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటి నుంచే దేవాన్ష్‌కు సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లను పెంచాలనే ఆలోచన నారా లోకేష్‌కు ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే దేవాన్ష్‌కు దీర్ఘకాలంలో ఫాలోవర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఫాలోవర్లు, లైకులు, షేర్లు, ట్రెండింగ్ అంటూ చిన్న పిల్లాడి మదిలో అనవసరపు చర్చ జరిగితే అది అతని మనస్తత్వంపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment