సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన ట్విట్టర్ ఖాతా బుధవారం హ్యాక్ అయ్యింది. పైగా హ్యకర్లు ఖాతా పేరును ఎలెన్ మస్క్ అని పేరు మార్చారు. అంతేకాదు ప్రోఫైల్‌లో చేప ఫోటో పెట్టారు. అదే సమయంలో కొన్ని ట్వీట్లు కూడా చేశారు. అయితే కొద్ది సమయంలోనే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆ ఖాతాను రికవరి చేసిందని ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఆ ట్విట్టర్ ఖాతా యథావిధిగా పనిచేస్తోంది. ఆ ట్వీట్లు కూడా తొలగించారు.
అయితే హ్యాకర్లు గతంలో ప్రధాని మోదీ ఖాతాను హ్యాక్ చేసిన వారే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఖాతాను కూడా హ్యాక్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే అప్పుడూ మోదీ ఖాతా హ్యాక్ అయినప్పుడు ఏం కంటెంట్ ఉందో అదే కంటెంట్ ఈ ఖాతాలో కూడా ఉంది. ఇటీవల చాలామంది ప్రముఖుల ఖాతాలు హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.
(చదవండి: ఒమిక్రాన్ ఉధృతిని ఆపలేం.. బూస్టర్‌తో ప్రయోజనం ఉండకపోవచ్చు! అయినా ఆందోళనవద్దు!: డాక్టర్ జైప్రకాష్)
Comments
Please login to add a commentAdd a comment