శ్రీలంక స్వాతంత్య్రం పొంది 70 ఏళ్లవుతున్న సందర్భంగా తలపెట్టిన ‘నిదాహస్’ ముక్కోణపు టి20 టోర్నీ మంగళవారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య శ్రీలంకను ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఎదుర్కోనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి సహా ఆరుగురు రెగ్యులర్ ఆటగాళ్లు లేకుండానే బరిలో దిగుతున్నందున టీమిండియా కొత్తకొత్తగా కనిపిస్తోంది. అన్ని విభాగాల్లో కూర్పు మారనుంది. ఈ నేపథ్యంలో అలవాటైన ఉపఖండ పరిస్థితుల్లో రోహిత్ శర్మ సారథ్యంలోని మన జట్టు ఎలా ఆడుతుందోననే ఆసక్తి నెలకొంది.