గత రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో జరిగిన ట్రై సిరీస్ టీ 20 సిరీస్ ఫైనల్లో భారత్ ఆఖరి బంతికి విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ చివర్లో ఉత్కంఠగా మారిపోయింది. ఇది అలాంటి ఇలాంటి ఉత్కంఠ కాదు. రెండు నిమిషాల పాటు తనువును ఉన్నచోటే బంధించింది. కళ్లను రెప్పలు కొట్టకుండా కట్టేసింది. గుండె దడను అమాంతం పెంచేసింది. చివరకు టీమిండియా గెలిచి మన అభిమానుల్ని ఊపిరి తీసుకునేలా చేసింది.