సిరీస్‌ కంటే.. చహల్‌ ఫొటోనే హైలైట్‌..! | Rohit Sharma Trolled Yuzvendra Chahal Over His Muscles | Sakshi
Sakshi News home page

సిరీస్‌ కంటే.. చహల్‌ ఫొటోనే హైలైట్‌..!

Published Tue, Jan 21 2020 9:09 PM | Last Updated on Tue, Jan 21 2020 9:21 PM

Rohit Sharma Trolled Yuzvendra Chahal Over His Muscles - Sakshi

న్యూఢిల్లీ : ‘హిట్‌ మ్యాన్‌’ రోహిత్‌ శర్మ మణికట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ను ట్రోల్‌ చేశాడు. టీమిండియా ఆసీస్‌తో సిరీస్‌ నెగ్గినదానికంటే.. చహల్‌ కండల ప్రదర్శనే హైలైట్‌గా నిలిచిందని ట్విటర్‌లో చమత్కరించాడు. దాంతోపాటు షర్ట్‌ లేకుండా ఉన్న చహల్‌ ఫొటోను, హాలీవుడ్‌ స్టార్‌, మాజీ రెజ్లర్‌ డ్వేన్‌ జాన్సన్‌ ఫొటోను జతచేసి ట్విటర్‌లో పోస్టు చేశాడు. కాగా, రోహిత్‌ ట్వీట్‌కు అంతే సరదాగా చహల్‌... ‘ది రాక్‌’అని రిప్లై ఇచ్చాడు. డ్వేన్‌ జాన్సన్‌ ‘ది రాక్‌’ పేరుతో రెజ్లర్‌గా బరిలోకి పాపులర్‌ అని తెలిసిందే. మైదానం బయట కూడా రోహిత్‌ చహల్‌ మంచి స్నేహితులు కావడం గమనార్హం.

ఇదిలాఉండగా.. నిర్ణయాత్మక మూడో వన్డేలో 119 పరుగులతో రోహిత్‌ చెలరేగాడు. దీంతో 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. రోహిత్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇక అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 9000 పరుగులు పూర్తిచేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ (217) రికార్డు అందుకున్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement